Breaking News

తొలి టీ20లో భారత్ ఘన విజయం

లక్నో వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆల్‌రౌండ్ విధ్వంసంతో పాటు అరంగేట్ర బౌలర్ నమన్ ధీర్ మ్యాజిక్ స్పెల్‌తో వెస్టిండీస్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా, అరంగేట్ర ఆటగాడు నమన్ ధీర్ (3/31) దాటికి విండీస్‌ను 171 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 172 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రేయస్ అయ్యర్ కేవలం 43 బంతుల్లోనే 102* పరుగులు చేసి…

Read Full News

పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికల వ్యూహం:ఏపీ

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండవల్లిలో రెండు గంటల పాటు కీలక భేటీ నిర్వహించారు. 2024 అసెంబ్లీ పోరులా కాకుండా స్థానిక ఎన్నికల్లో ప్రాంతాల వారీగా పార్టీ సంపూర్ణ బలాన్ని అంచనా వేసి, ఎక్కడ ఏ పార్టీ క్యాడర్ బలంగా ఉందో అక్కడ ఆ పార్టీకే అవకాశం ఇచ్చేలా నయా సీట్ల సర్దుబాటు ఫార్ములాపై చర్చించారు. 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై…

Read Full News

ఎర్రవల్లి భూముల్లో 45 ఎకరాల వ్యత్యాసం

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో అధికారిక రికార్డుల ప్రకారం 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాల్సి ఉండగా, ఇటీవల నిర్వహించిన సర్వేలో 343 ఎకరాలు మాత్రమే గుర్తించినట్లు రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో తెలిపారు. రికార్డులకు, క్షేత్రస్థాయి పరిశీలనకు మధ్య ఉన్న 45 ఎకరాల భూమి ఎక్కడ ఉందో తేల్చాలని సీఎం ఆదేశించడంతో రెవెన్యూ శాఖ ఎర్రవల్లి మరియు వెంకటాపురం గ్రామాల పరిధిలో సమగ్ర…

Read Full News

ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ.. విద్యార్థినులకు గాయాలు

కోరుట్ల, అక్టోబర్ 6 (E6tv NEWS : ప్రతినిధి). జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు, విద్యార్థులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. మరో వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన బస్సుగాయపడిన విద్యార్థినులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స… స్థానికుల వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హర్షిత, మోక్షితలు పాఠశాల ముగిసిన అనంతరం టాటా మ్యాజిక్ వాహనంలో కథలాపూర్ మండలంలోని…

Read Full News

మానాల అభివృద్ధికి రూ.14 కోట్లతో వివిధ పనులు

సూరమ్మ ప్రాజెక్టుతో సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం పామ్‌ఆయిల్ సాగుతో రైతులకు అధిక ఆదాయం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మహిళలు, యువత, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే భూపతి రెడ్డి కమ్మర్‌పల్లి, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి) మానాల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్….

Read Full News

ధాన్యం దళారుల సిండికేట్‌పై రైతుల ఆగ్రహం

రేట్లు తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు క్వింటాకు రూ.3,800 వరకు ధర పలుకుతుండగా తగ్గింపుపై రైతుల ఆవేదన చందూర్, అక్టోబర్ 6: (E6tv NEWS: ప్రతినిధి).ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంచి ధర లభిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధాన్యం క్వింటాకు సుమారు రూ.3,800 వరకు ధర పలుకుతుండటంతో రైతులు ఊరట చెందుతున్న తరుణంలో.. కొందరు ధాన్యం దళారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు…

Read Full News

సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం – అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS

“PAUSE FOR SAFETY” – ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి నిర్మల్, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). అక్టోబర్ 2026ను జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంగా పాటిస్తున్న సందర్భంగా, సైబర్ నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం (DPO), నిర్మల్‌లో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను…

Read Full News

మాజీ మావోయిస్టులకు కవిత పిలుపు..

జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులు ప్రజాసేవ చేసేందుకు తమ పార్టీ తెలంగాణ రక్షణ సేనలోకి రావలసిందిగా ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆహ్వానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పర్యటనలో భాగంగా శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, లోకం మార్పు కోసం పోరాడిన మాజీ మావోయిస్టులకు తమ పార్టీ ఒక సరైన వేదిక కాగలదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను…

Read Full News

గోషామహల్‌లో ఓట్ల తొలగింపు కుట్ర: అసదుద్దీన్

హైదరాబాద్‌లోని గోషామహల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ముస్లిం ఓటర్ల పేర్లను ఉద్దేశపూర్వకంగా జాబితా నుంచి తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా బూత్ నంబర్లు 28, 30, 127లలో 2002 సంవత్సరం నుంచి ఓటు హక్కు కలిగిన ముస్లింల పేర్లను తొలగించేందుకు ముందస్తుగా ప్రింట్ చేసిన ఫారం-7 దరఖాస్తులను సమర్పిస్తున్నారని విమర్శించారు. ఒకే వ్యక్తి 122 ఫారం-7…

Read Full News

పోలీసుల రిమాండ్ పిటిషన్ తిరస్కరణ: క్రిశాంక్‌కు బెయిల్

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద బ్యానర్లు ఏర్పాటు చేశారన్న కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మన్నె క్రిశాంక్‌కు నాంపల్లి/సికింద్రాబాద్ కోర్టులో ఊరట లభించింది. సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై అందిన ఫిర్యాదు ఆధారంగా గోపాలపురం పోలీసులు ఆయనను ఉదయం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను న్యాయస్థానంలో హాజరుపరచగా, క్రిశాంక్‌ను రిమాండ్‌కు తరలించాలన్న పోలీసుల విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు….

Read Full News