Breaking News

భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ ఘటన: సుధాకర్ మృతి

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన పోలాస సుధాకర్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) తన దుకాణాన్ని లక్ష్యంగా చేసుకుని పదే పదే జరిమానాలు విధిస్తూ తీవ్ర వేధింపులకు గురిచేశారని, అందుకే విసిగిపోయి సుధాకర్ ఈ దారుణానికి ఒడిగట్టారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. 90 శాతం కాలిన గాయాలతో ఆయన ప్రాణాలు కోల్పోవడంతో నిజామాబాద్ జిల్లా…

Read Full News

ఎమ్మెల్యే పోచారం అండదండలతో సొసైటీని అభివృద్ధి చేస్తాం

రైతులకు మెరుగైన సేవలే లక్ష్యం: నూతన చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు కోటగిరి, అక్టోబర్ 6: (E6tv NEWS: ప్రతినిధి) బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అండదండలతో ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని నూతన చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలం ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార…

Read Full News

ఈసీ ఆఫీస్ ఎదుట హైడ్రామా…బారికేడ్‌పైకి ఎక్కిన రాహుల్ గాంధీ

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఢిల్లీలో చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. పార్లమెంట్ నుంచి ‘నిర్వాచన్ సదన్’ (ఎన్నికల సంఘం కార్యాలయం) వైపు సాగుతున్న ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బారికేడ్‌పైకి ఎక్కి నిరసన తెలపడమే కాకుండా అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. ఎన్నికల సంఘాన్ని ‘చీటింగ్ కమిషన్’గా అభివర్ణించిన కాంగ్రెస్, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు…

Read Full News

ఉస్మానియా యూనివర్సిటీకి భారీగా తరలిన MSF విద్యార్థి నాయకులు

బాన్సువాడ, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి) మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “హాలో విద్యార్థి – చలో ఉస్మానియా యూనివర్సిటీ” కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గం నుంచి విద్యార్థి, యువ నాయకులు భారీగా తరలివెళ్లారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు, బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సోంపూర్ పోచిరాం మాదిగ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీకి బయలుదేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన ఆధారమని,…

Read Full News

కెప్టెన్‌గా తప్పుకున్న హర్మన్‌ప్రీత్…కానీ ఎందుకు?

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సుదీర్ఘ కాలం సేవలందించిన స్టార్ ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ (37) అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. గువాహటిలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాతో పాటు హెడ్ కోచ్ అమోల్ ముజుందార్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానలతో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. 2016లో టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, 2023 నుంచి అన్ని ఫార్మాట్లలో జట్టును…

Read Full News

ఢిల్లీలో ఈసీ ఆఫీస్‌కు ఇండియా కూటమి భారీ మార్చ్..

దేశ రాజధాని ఢిల్లీలో విపక్ష ఇండియా కూటమి ఎంపీలు భారీ ఆందోళన చేపట్టారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ మరియు ఫారమ్-6 మార్పులలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, పార్లమెంట్ ప్రాంగణం నుంచి నిర్వాచన్ సదన్ (ఎన్నికల సంఘం కార్యాలయం) వరకు ఎంపీలు పాదయాత్ర నిర్వహించారు. ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేసిన నేతలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి…

Read Full News

బ్యాంకుల్లో 5-డే వర్కింగ్ అమలు చేయాలి: కవిత మద్దతు

బ్యాంక్ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని, లేదంటే బ్యాంకులను వారమంతా తెరిచి ఉద్యోగులకు షిఫ్ట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని కోరారు. పనిభారం, నిరంతర ఒత్తిడి ఎదుర్కొంటున్న బ్యాంకింగ్ సిబ్బంది డిమాండ్ ఎంతగానో న్యాయమైనదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం రెండవ, నాల్గవ శనివారాలు మాత్రమే సెలవులు పొందుతున్న ఉద్యోగుల కోసం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సుదీర్ఘ పోరాటం చేస్తోందని…

Read Full News

చెన్నై తీరంలో భారీగా చైనా క్రాకర్స్ లభ్యం!

చెన్నై పోర్టు ద్వారా నిషేధిత చైనా బాణాసంచాను అక్రమంగా దేశంలోకి దిగుమతి చేసుకునేందుకు స్మగ్లర్లు వేసిన పెద్ద ప్లాన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భగ్నం చేశారు. స్టేషనరీ, మెడికల్ గ్లోవ్స్, హెయిర్ బ్యాండ్స్, వార్డ్‌రోబ్‌లు మరియు షూ రాక్స్ ఉన్నట్లు తప్పుడు డిక్లరేషన్ పేపర్లు సృష్టించి కంటైనర్లను రవాణా చేస్తుండగా, పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన డీఆర్‌ఐ అధికారులు కార్టన్ పెట్టెల వెనుక దాచి ఉంచిన సుమారు రూ. 12 కోట్లకు పైగా…

Read Full News

సుధాకర్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలిబాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌ 6:(E6tv NEWS: ప్రతినిధి) భీంగల్‌లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పొలాస సుధాకర్‌ పోలీసుల వేధింపులు తాళలేక పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని, చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సుధాకర్‌ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన ఆరోపించారు.సుధాకర్‌ మృతదేహాన్ని…

Read Full News

మళ్లీ ట్రిలియనీర్ రేస్‌లోకి ఎలాన్ మస్క్!

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంపద మళ్లీ రికార్డు స్థాయికి చేరింది. మూడు నెలల విరామం తర్వాత ఆయన ఆస్తి విలువ తిరిగి $1 ట్రిలియన్ మార్క్‌ను దాటి $1.04 ట్రిలియన్లకు చేరుకుంది. స్పేస్‌ఎక్స్, టెస్లా కంపెనీల షేర్లు గణనీయంగా పుంజుకోవడంతో సోమవారం ఒక్కరోజే ఆయన నికర ఆస్తి విలువ $65 బిలియన్లు పెరిగింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ ప్రస్తుత సంపద రెండో స్థానంలో ఉన్న జెఫ్…

Read Full News