Breaking News

ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ.. విద్యార్థినులకు గాయాలు

కోరుట్ల, అక్టోబర్ 6 (E6tv NEWS : ప్రతినిధి).

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు, విద్యార్థులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు.

మరో వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన బస్సు
గాయపడిన విద్యార్థినులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స…

స్థానికుల వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హర్షిత, మోక్షితలు పాఠశాల ముగిసిన అనంతరం టాటా మ్యాజిక్ వాహనంలో కథలాపూర్ మండలంలోని తమ ఇళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలో కోరుట్ల పట్టణ శివారుకు చేరుకోగా, మరో వాహనాన్ని తప్పించబోయిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి విద్యార్థులు ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొట్టింది.

ప్రమాదంలో హర్షిత, మోక్షితలకు గాయాలు కాగా, స్థానికులు వారిని వెంటనే కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కోరుట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *