Breaking News

పోలీసుల రిమాండ్ పిటిషన్ తిరస్కరణ: క్రిశాంక్‌కు బెయిల్

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద బ్యానర్లు ఏర్పాటు చేశారన్న కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మన్నె క్రిశాంక్‌కు నాంపల్లి/సికింద్రాబాద్ కోర్టులో ఊరట లభించింది. సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై అందిన ఫిర్యాదు ఆధారంగా గోపాలపురం పోలీసులు ఆయనను ఉదయం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను న్యాయస్థానంలో హాజరుపరచగా, క్రిశాంక్‌ను రిమాండ్‌కు తరలించాలన్న పోలీసుల విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు. రెండు వర్గాల వాదనలను విన్న కోర్టు రిమాండ్‌ను తిరస్కరించడంతో ఆయనకు ఊరట లభించినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *