Breaking News

ఫ్రాన్స్ ఆందోళనలపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్రాన్స్‌లో విద్యావ్యవస్థలోని లోపాలు, నిధుల కొరత మరియు ఉపాధ్యాయుల కొరతపై విద్యార్థులు, ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న ఆందోళనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. అదుపుతప్పిన వలసల వల్లే ఈ నిరసనలు జరుగుతున్నాయని, ఫ్రాన్స్‌ను ఇస్లాం తన అధీనంలోకి తీసుకునే ప్రయత్నమిదని ఆయన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆరోపించారు. అయితే, నిరసనకారుల డిమాండ్లలో వలసలు లేదా మతపరమైన అంశాలు ఏమాత్రం లేవని స్పష్టం చేసిన ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారో.. ట్రంప్…

Read Full News

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీఐ కీలక అఫిడవిట్

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి దాఖలైన ఎలక్షన్ పిటిషన్ పరిష్కారమయ్యే వరకు ఉపఎన్నిక నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తెలంగాణ హైకోర్టులో ప్రమాణపత్రం (అఫిడవిట్) దాఖలు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ విజయాన్ని సవాలు చేస్తూ పి. విజయారెడ్డి వేసిన పిటిషన్ ఇంకా విచారణలో ఉన్నందున ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వవద్దని ఆమె కోర్టును ఆశ్రయించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఎన్నికల ప్రామాణికతపై పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పుడు ఉపఎన్నికలు…

Read Full News

వరంగల్‌లో గుడిసెల కూల్చివేత..అర్ధరాత్రి పోలీసులను నిలదీసిన పేదలు

వరంగల్ నగరంలోని భద్రకాళి ఆలయ సమీపంలో ఉన్న చెరబండ రాజు కాలనీలో అర్ధరాత్రి వేళ గుడిసెల తొలగింపు చర్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. భారీగా మోహరించిన ప్రత్యేక పోలీసు బలగాల పహారా మధ్య అధికారులు కూల్చివేతలకు దిగడంతో, తమ ఇళ్లను కాపాడుకునేందుకు స్థానిక నిరుపేదలు, ముఖ్యంగా మహిళలు తీవ్రంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐ కరుణాకర్‌తో పాటు పోలీసులతో బాధితులు వాగ్వాదానికి దిగి, ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ కన్నీరుమున్నీరుగా ఆవేదన వ్యక్తం…

Read Full News

నేడు తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ స్థానిక ఎన్నికల భేటీ !

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగాఢా మోగనున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. గత కొన్ని నెలలుగా నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో వన్-టు-వన్ భేటీలు నిర్వహిస్తున్న జగన్, మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల వారీగా పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితిపై సమగ్ర సమాచారాన్ని ఆరా తీస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్‌సిపి యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉండేలా అభ్యర్థుల ఎంపిక, వ్యూహరచన…

Read Full News

ప్రజాసేవలో ప్రధాని మోదీ 25 ఏళ్లు పూర్తి…’వికసిత్ భారత్ సంకల్ప్ సభ’లో ప్రసంగం

గుజరాత్ ముఖ్యమంత్రిగా మరియు దేశ ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉదయం వర్చువల్‌గా ‘వికసిత్ భారత్ సంకల్ప్ సభ’ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ‘వికసిత్ భారత్ @ 2047’ లక్ష్య సాధన కోసం ఆయన దేశప్రజలతో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు. ప్రధాని ప్రసంగానికి ముందు బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రసంగించనుండగా, అనంతరం గుజరాత్‌వ్యాప్తంగా ‘సేవా జ్యోతి కలశ యాత్ర’ను ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 17న…

Read Full News

ఆందోళనల వేళ సీఈసీ నిర్ణయం: పర్యటనలు రద్దు

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అధికారిక పర్యటనలు హఠాత్తుగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఇవాళ, రేపు ఆయన ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించి ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించాల్సి ఉండగా, ఆ కార్యక్రమాలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై విపక్ష పార్టీలు, పలు వర్గాలు దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేసిన నేపధ్యంలో ఈ పర్యటన వాయిదా పడటం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే…

Read Full News

SIR పేరుతో ఓట్ల తొలగింపును నిరసిస్తూ కాంగ్రెస్ ర్యాలీ

వర్ని, అక్టోబర్ 7: (E6tv NEWS ప్రతినిధి).SIR పేరుతో ఓట్లలో అవకతవకలకు పాల్పడుతూ అర్హులైన ఓటర్ల ఓట్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ విధానాన్ని నిరసిస్తూ బుధవారం వర్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ CEC జ్ఞానేశ్వర్ తీరును నిరసిస్తూ నాయకులు నినాదాలు చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమంగా ఓట్ల తొలగింపు జరుగుతోందని ఆరోపిస్తూ, దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన…

Read Full News

నాలుగేళ్ల తర్వాత భువనేశ్వర్ రీఎంట్రీ

స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి భారత టీ20 జట్టులోకి ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌తో అక్టోబర్ 22 నుంచి జరగనున్న ఐదు టీ20ల సిరీస్ కోసం సెలెక్టర్లు భువీని జట్టులోకి తీసుకున్నారు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 17 వికెట్లు తీసి పవర్‌ప్లేలో ఆకట్టుకున్నప్పటికీ, మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హయాంలో భువీకి అవకాశాలు లభించలేదనే ఆరోపణలు ఉన్నాయి. అగార్కర్ తప్పుకున్న తర్వాత తాత్కాలిక చీఫ్ సెలెక్టర్ ప్రజ్ఞాన్…

Read Full News

వికారాబాద్‌లో ఇండియా కూటమి భారీ నిరసన..

వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ నాయకత్వంలో ఎన్టీఆర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో నాయకులు ‘ఓటు బచావో – దేశ్ బచావో’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో…

Read Full News

సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం విజయవాడ నుంచి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి పయనం కానున్నారు. ఈ హస్తిన పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌లతో భేటీ కానున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు రెండో దశ భూసేకరణ, పునరావాస ప్యాకేజీ కోసం రూ.33,000 కోట్ల నిధుల మంజూరుతో పాటు, స్పిల్‌వేపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి…

Read Full News