News
ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ ఆగ్రహం: సీఈసీ రాజీనామాకు డిమాండ్!
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు దిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్లు:…
లేట్ నైట్ సౌండ్ పొల్యూషన్: పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్!
సినీ నటుడు అల్లు శిరీష్ తన నివాస ప్రాంతంలో అర్ధరాత్రి వేళ వినిపిస్తున్న తీవ్రమైన శబ్ద కాలుష్యంపై హైదరాబాద్ సిటీ పోలీసులను సోషల్ మీడియా వేదికగా ఆశ్రయించారు. షేక్‌పేట్‌లోని ‘అపర్ణ వన్’ అపార్ట్మెంట్లో నివాసముంటున్న ఆయన, సమీపంలోని వినోబా నగర్ హనుమాన్ ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల వరకు మైకులు, పాటలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక నిమజ్జన వేడుకల కారణంగా సెప్టెంబర్ 25 వరకు ఓపిక పట్టాలని ఫిల్మ్‌నగర్…
ఈడీ ఆఫీస్ ముట్టడికి యత్నించిన బిఆర్ఎస్ నేతలు..
హైదరాబాద్ (E6TV ): హైదరాబాద్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రాంతీయ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యాపారాలు, ఆస్తులపై ఈడీ తక్షణమే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష భారత రాష్ట్రీయ సమితి (BRS) నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. గత సోదాలపై మౌనమెందుకు? – BRS నేతల నిలదీత గతంలో మంత్రికి చెందిన నివాసాలు, సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు…
ఎల్పీయూ యూనివర్సిటీ:విద్యార్థుల నిరసనకు దారితీసిన పరిస్థితులు ఏమిటి?
పంజాబ్‌లోని ఫగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) క్యాంపస్‌లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర కలకలానికి దారితీశాయి. క్యాంపస్‌లోని GH-3 హాస్టల్లో ఉన్న ఒక విద్యార్థినిపై బయటి పనిమనిషి లేదా ప్లంబర్ లైంగిక దాడికి పాల్పడ్డాడనే ప్రచారం సోషల్ మీడియా గ్రూపుల్లో విపరీతంగా వ్యాపించింది. దీనిపై యూనివర్సిటీ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఆగ్రహించిన విద్యార్థులు సెప్టెంబర్ 26 మరియు 27 మధ్యరాత్రి 1:00 గంటల సమయంలో ఒక్కసారిగా నిరసనకు దిగారు. ముఖాలకు రుమాళ్లు…
పాఠశాలలకు రూ.6 లక్షల విలువైన సామగ్రి విరాళం
ముచ్కూర్, ఎర్గట్ల, పచ్చలనడ్కూడ పాఠశాలలకు సైన్స్ ల్యాబ్ మెటీరియల్భీంగల్ కస్తూరిబా పాఠశాలకు 35 డ్యూయల్ డెస్క్ బెంచీలు వేల్పూర్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి) బాల్కొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సౌజన్యంతో, ఆయన వియ్యంకుడు, పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి సహకారంతో సుమారు రూ.6 లక్షల విలువైన విద్యా సామగ్రిని అందజేశారు. వేల్పూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం ఈ సామగ్రిని ఆయా పాఠశాలల ప్రతినిధులకు అందించారు. ముచ్కూర్, ఎర్గట్ల,…
కాకినాడలో భారీ వర్షాలు: జేసీబీపై వెళ్లి పరిశీలించిన అధికారులు
భారీ వర్షాల కారణంగా గాడేరు డ్రెయిన్ పొంగిపొర్లడంతో కాకినాడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా 48, 49 డివిజన్లలోని ఇందిరమ్మ కాలనీతో పాటు అనేక ప్రాంతాలు గత మూడు రోజులుగా నీటి ముంపులోనే ఉన్నాయి. రహదారులు చెరువులను తలపిస్తుండటంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకుల కోసం కూడా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడటంతో స్థానిక జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణ వాహనాలు వెళ్లలేని ఇందిరమ్మ కాలనీకి నగర కమిషనర్, తహసీల్దార్ సహా…
ఈరోజు బ్యాంకులు తెరిచి ఉంటాయా? వినియోగదారులు తెలుసుకోవాల్సిన విషయాలు
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రతినిధుల మధ్య ఆదివారం రాత్రి (సెప్టెంబర్ 27, 2026) జరిగిన చర్చలు సఫలం కావడంతో ప్రతిపాదిత 3 రోజుల సమ్మె వాయిదా పడింది. దీనివల్ల బ్యాంక్ ఖాతాదారులకు పెద్ద ఉపశమనం లభించింది. 1. నేడు, రాబోయే రోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయా? 2. వారానికి 5 రోజుల బ్యాంకింగ్ (5-Day Banking) పరిస్థితి ఏంటి? 3. ఇతర ముఖ్యాంశాలు & ఒప్పందాలు మొత్తానికి సమ్మె…
సైబర్ క్రిమినల్స్ వలలోప్రముఖ డాక్టర్…రూ.14.61 కోట్ల నష్టం!
హైదరాబాద్‌కు చెందిన ఓ దంత వైద్యుడు ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో జరిగిన భారీ సైబర్ మోసంలో ఏకంగా రూ. 14.61 కోట్లు కోల్పోయారు. మోనికా మాధవ్ అనే పేరుతో ఫేస్బుక్లో పరిచయమైన ఓ మహిళ.. రోజుకు రూ. 4 నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తున్నానని నమ్మించి, అతడిని టెలిగ్రామ్ ద్వారా నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోకి దించింది. మొదట రూ. 30 లక్షల పెట్టుబడికి లాభం వచ్చినట్లు చూపి, అందులో రూ. 85 వేలు విత్‌డ్రా చేసుకునే…
మణికొండ గేటెడ్ కమ్యూనిటీపై ముఠా దొంగల దాడి యత్నం
హైదరాబాద్ శివార్లలోని మణికొండ నెక్నాంపూర్లో దొంగల ముఠా విరుచుకుపడి తీరని తీవ్ర ఆందోళన రేకెత్తించింది. గేటెడ్ కమ్యూనిటీ, చుట్టూ ఫెన్సింగ్, సెక్యూరిటీ సిబ్బంది, సీసీ కెమెరాల కాపలా ఉన్నప్పటికీ.. స్థానిక ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లోకి ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:20 గంటల సమయంలో ఆరుగురు అనుమానితులు చొరబడ్డారు. ప్రధాన ద్వారం గుండా వస్తే సెక్యూరిటీకి దొరికిపోతామని భావించిన దుండగులు లేక్‌సైడ్ ఉన్న ఫెన్సింగ్‌ను కత్తిరించి అపార్ట్మెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి C-బ్లాక్ మెట్ల మార్గం ద్వారా ఒక…
మోడల్ మండల సమాఖ్యలపై శిక్షణ
మద్నూర్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి) మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘం అధ్యక్షురాళ్లు, వీఓఏలకు మోడల్ మండల సమాఖ్యలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. NRLM రాష్ట్ర రిసోర్స్ పర్సన్లు ఎస్. రమాదేవి, ఓ. కవిత శిక్షణ అందించారు. రానున్న ఐదేళ్లలో సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు ఏ స్థాయికి చేరుకోవాలనే అంశంపై ముందుచూపుతో విజన్ (కల)ను ఎలా రూపొందించుకోవాలో శిక్షణలో వివరించారు. ఆ విజన్‌ను సాకారం చేసుకునేందుకు అవసరమైన వ్యూహాలను ఎలా…
