Breaking News

శిథిలావస్థలో రుద్రూర్ వెటర్నరీ ఆసుపత్రి

పెచ్చులూడి పడుతుండటంతో సిబ్బంది, పశుపోషకుల్లో ఆందోళన నూతన భవన నిర్మాణంపై అధికారులు దృష్టి సారించాలంటున్న పాడి రైతులు రుద్రూర్, సెప్టెంబర్ 27: (E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది, పశుపోషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనం పైకప్పు, గోడలకు సంబంధించిన పెచ్చులు ఊడిపడి కింద పడుతున్నాయని, దీంతో ఆసుపత్రిలో విధులు నిర్వహించే సిబ్బంది ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు…

Read Full News

బాపూజీ సేవలు, త్యాగాలను స్మరించుకోకపోతే తెలంగాణను అవమానించినట్లే

తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్ద దిక్కు బీఆర్ఎస్ హయాంలోనే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం: వేముల ప్రశాంత్ రెడ్డి కమ్మర్‌పల్లి, సెప్టెంబర్ 27:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్ద దిక్కుగా నిలిచారని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాపూజీ చేసిన సేవలు, త్యాగాలను స్మరించుకోకపోతే తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లేనని పేర్కొన్నారు.కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి…

Read Full News

రూ.63 వేల లంచం తీసుకుంటూ సీడీపీవో అరెస్ట్

అంగన్‌వాడీ టీచర్ల నుంచి లంచం డిమాండ్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ మెట్‌పల్లి, సెప్టెంబర్ 26: (E6tv NEWS: ప్రతినిధి) అంగన్‌వాడీ టీచర్ల నుంచి రూ.63 వేల లంచం తీసుకుంటూ మెట్‌పల్లి ఐసీడీఎస్‌ సీడీపీవో పద్మ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని సీడీపీవో కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల మెట్‌పల్లి మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలను సీడీపీవో పద్మ తనిఖీ చేశారు. తనిఖీలకు సంబంధించిన రిపోర్టును అనుకూలంగా నమోదు చేసేందుకు అంగన్‌వాడీ టీచర్ల నుంచి…

Read Full News

చెన్నేకొత్తపల్లిలో సేవా సంకల్ప్ అభియాన్ అంగన్వాడీ కార్యకర్తలకు యూనిఫాం చీరలు, చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులు, పుస్తకాల పంపిణీ25 మంది రైతులకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల అందజేత చెన్నేకొత్తపల్లి: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో శనివారం “సేవా సంకల్ప్ అభియాన్ – ఆంగన్ కా ఉత్సవ్” కార్యక్రమాన్ని నిర్వహించారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెన్నేకొత్తపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని చెన్నేకొత్తపల్లి, రామగిరి,…

Read Full News

ధర్మవరం చెరువును అద్భుతమైన లేక్‌ఫ్రంట్‌గా అభివృద్ధి చేస్తాం

రూ.100–150 కోట్లతో అభివృద్ధికి ప్రణాళిక.. కేంద్ర నిధుల కోసం ప్రయత్నం: మంత్రి సత్యకుమార్ ధర్మవరం, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి) ధర్మవరం పట్టణానికి ప్రకృతి ప్రసాదించిన వరం ధర్మవరం చెరువని, దాని సహజ స్వరూపాన్ని కాపాడుతూ ఆధునిక హంగులతో అద్భుతమైన లేక్‌ఫ్రంట్‌గా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్…

Read Full News

‘పండగల సీజన్‌లో బంగారం కొనొద్దు’.. ప్రధాని మోదీ విజ్ఞప్తి ఫలించేనా?

ధన్‌తేరస్, దీపావళి వంటి ప్రధాన పండుగలు సమీపిస్తున్న వేళ, అత్యవసరమైతే తప్ప భౌతిక బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవడం వల్ల విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకే ఆయన ఈ పిలుపునిచ్చారు. 2026 మే నెలలో తొలిసారి ఈ విజ్ఞప్తి చేసిన ప్రధాని, సెప్టెంబర్‌లోనూ మరోసారి స్పష్టం చేశారు. భారత్‌కు అవసరమైన బంగారంలో దాదాపు…

Read Full News

బత్తలపల్లిలో అంగన్‌వాడీ ఉత్సవం

అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సేవలు సమాజానికి ఆదర్శం: మంత్రి సత్యకుమార్ బత్తలపల్లి, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి) అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఆశా వర్కర్లు సమాజానికి అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్‌వాడీ ఉత్సవంలో మంత్రి…

Read Full News

బస్వాపూర్‌లో చాకలి ఐలమ్మ 131వ జయంతి

జుక్కల్ మండలం, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో చాకలి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి వేడుకలను గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వి. రమణ సురేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి భారద్వాజ్, వార్డు సభ్యులు శివాజీ పటేల్, సంగ్రామ్, హైదర్ సాబ్, నాగనాథ్, షాదుల్, ఫీల్డ్ అసిస్టెంట్ బి. రాజు, కారోబార్ ఎం. గంగారం పాల్గొన్నారు.అలాగే రజక…

Read Full News

ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరుబాట

ఓటు హక్కు పరిరక్షణ కోస 28న కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా కామారెడ్డి, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి) ఓటు హక్కు పరిరక్షణ, పారదర్శకమైన ఓటర్ల జాబితా కోసం కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టనుంది. SIR ప్రక్రియ, ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఈ నెల 28న కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. TPCC ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టరేట్ ఎదుట…

Read Full News

సైబరాబాద్‌లో 1.19 లక్షల గణేష్ విగ్రహాల నిమజ్జనం..

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా ఇప్పటివరకు సైబరాబాద్ వ్యాప్తంగా 1,19,667 గణనాథుల విగ్రహాలు విజయవంతంగా నిమజ్జనమయ్యాయి. నిమజ్జన కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రత్యేక చర్యలు చేపట్టింది. నిమజ్జన ఘాట్ల వద్ద పూల వ్యర్థాలను వేరుగా సేకరిస్తున్న అధికారులు, గత 11 రోజుల్లో సుమారు 6,000 కిలోల పూల వ్యర్థాలను సేకరించినట్లు వెల్లడించారు. ఈ పూలను వేరుచేసి, ఎండబెట్టి అగరబత్తులు,…

Read Full News