Breaking News

142 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

రూ.1.42 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందజేత బాన్సువాడ, అక్టోబర్ 29 (E6 టీవీ న్యూస్): నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని జనరల్ ఫంక్షన్ హాల్‌లో గురువారం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వర్ని, చందూర్, కోటగిరి, పోతంగల్, మోశ్రా, రుద్రూర్ మండలాలకు చెందిన మొత్తం 142 మంది లబ్ధిదారులకు రూ.1,42,16,472 విలువైన…

Read Full News

మెట్‌పల్లి మున్సిపల్ సమావేశంలో గందరగోళం.. అఖిలపక్ష కౌన్సిలర్ల వాకౌట్!

చైర్మన్ లింబాద్రి ఏకపక్ష నిర్ణయాలపై నిరసన.. 22 మంది కౌన్సిలర్లు బయటకు.. సమావేశం రద్దు జగిత్యాల, అక్టోబర్ 29 (E6 టీవీ న్యూస్). కోరుట్ల నియోజకవర్గంలోని మెట్‌పల్లి మున్సిపాలిటీ సాధారణ కౌన్సిల్ సమావేశం గందరగోళం మధ్య సాగింది. మున్సిపల్ చైర్మన్ లింబాద్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్ర కౌన్సిలర్లతో కూడిన అఖిలపక్షం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చైర్మన్ వ్యవహారశైలిని నిరసిస్తూ మొత్తం 22 మంది కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు….

Read Full News

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

భైంసా, అక్టోబర్ 29 (E6 టీవీ న్యూస్). పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గురువారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల, భైంసా డివిజన్ ఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పోలీస్ శాఖకు చెందిన సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. పోలీస్ సిబ్బందితో పాటు వాలంటీర్లు, ఇతర రక్తదాతలు…

Read Full News

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. హెల్మెట్ ఉంటే ప్రాణం దక్కేది!

జగిత్యాల, అక్టోబర్ 28 (E6tv న్యూస్). జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన నూతి పెళ్లి అక్షయ్ అలియాస్ శివకుమార్, రంగాపూర్–భీమారం గ్రామాల మధ్య తాను నడుపుతున్న పల్సర్ బైక్ అదుపుతప్పి స్కిడ్ కావడంతో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలు కావడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై మేడిపల్లి ఎస్ఐ ఎం. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. యువకుడు హెల్మెట్…

Read Full News

భైంసాలో దుకాణాలు బిల్లులు ఇవ్వడం లేదని ఫిర్యాదు

వినియోగదారులకు ఇబ్బందులు.. సంబంధిత శాఖలతో తనిఖీలు చేపట్టాలని సబ్ కలెక్టర్‌కు వినతి భైంసా, అక్టోబర్ 28 (E6tv న్యూస్). భైంసా పట్టణంలోని పలు వాణిజ్య దుకాణాల్లో వినియోగదారులకు జీఎస్టీ బిల్లులు ఇవ్వడం లేదని, దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజా చైతన్య వినియోగదారుల సమితి సభ్యుడు సుంకేట మహేష్ బాబు కోరారు. ఈ మేరకు అక్టోబర్ 26న భైంసా సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. పట్టణంలోని కిరాణా, వస్త్ర, మెడికల్, జనరల్ స్టోర్స్, ఎలక్ట్రానిక్స్…

Read Full News

దృష్టిబాధితులకు భరోసా.. 30 మంది దివ్యాంగులకు మొబిలిటీ స్టిక్స్ పంపిణీ

దివ్యాంశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం భైంసా, అక్టోబర్ 28 (E6tv న్యూస్). దృష్టి లోపంతో బాధపడుతున్న దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవనం సాగించేందుకు మొబిలిటీ స్టిక్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఓంకార్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ జోగ్ దండే చంద్రకాంత్ పేర్కొన్నారు. దివ్యాంగులకు అండగా నిలవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భైంసా పట్టణంలోని పీఆర్‌టీయూ భవన్‌లో దివ్యాంశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, తనూర్ కేంద్రంలోని ఓంకార్ హాస్పిటల్ డాక్టర్ జోగ్ దండే చంద్రకాంత్…

Read Full News

ప్రేమ వేధింపులు.. స్థానికుల చేతికి చిక్కిన నిందితుడు!

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న జుబేర్ అనే యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని గత కొంతకాలంగా వెంబడిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడి గత నేరచరిత్ర బయటపడింది. అతడు గతంలో హుజూరాబాద్‌లో నమోదైన పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడిని…

Read Full News

కరెంట్ తీగలతో ప్రాణభయం: ఆరు నెలలుగా అధికారుల నిర్లక్ష్యం!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని అరపేట గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ కుటుంబాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. గ్రామానికి చెందిన హిమామ్ భి అనే మహిళ ఇంటి పైకప్పు మీదుగా ప్రమాదకరంగా విద్యుత్ తీగలు వెళ్తుండటంతో, ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ఆ కుటుంబం నరకం చూస్తోంది. ఆ తీగలను తొలగించాలని కోరుతూ గత ఆరు నెలలుగా విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు ఎంతమాత్రం స్పందించడం లేదని బాధితురాలు ఆవేదన…

Read Full News

యశోద హాస్పిటల్స్ అత్యాధునిక యూరాలజీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సేవలు

నిజామాబాద్ ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలపై కొత్త భరోసా నిజామాబాద్, అక్టోబర్ 28 (E6 TV న్యూస్). కిడ్నీ వ్యాధులు, ప్రోస్టేట్ సమస్యలు, మూత్రనాళ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న నిజామాబాద్ జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు మరింత చేరువయ్యాయి. కిడ్నీ మార్పిడి (ట్రాన్స్‌ప్లాంటేషన్) సహా సంక్లిష్ట యూరాలజీ చికిత్సలను హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్నాయని సీనియర్ కన్సల్టెంట్ రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు.యూరాలజీ సమస్యలను ప్రారంభ దశలోనే…

Read Full News

బీఆర్ఎస్ నేత అరెస్ట్: గోదావరిఖనిలో మాజీ ఎమ్మెల్యే ధర్నా

ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ నాయకుడు బుర్ర ముత్యాలు గౌడ్ అరెస్ట్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బుర్ర ముత్యాలును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్…

Read Full News