Breaking News

హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

హుజురాబాద్, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి). హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం కోరింది.మంగళవారం సైదాపూర్ మండల పరిధిలోని ఆకునూరు గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, వైస్ చైర్‌పర్సన్ అంజలి, కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు…

Read More

బస్వాపూర్‌లో ఘనంగా వన మహోత్సవం

బస్వాపూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ మాస్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటారు. కేజీబీవీ, ప్రభుత్వ యూపీఎస్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రంతో పాటు బస్వాపూర్ బసవన్న చెరువు కట్టపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామ సర్పంచ్ శ్రీమతి వి. రమణ సురేష్, ఉప సర్పంచ్ బి. అనిల్ కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి భారద్వాజ్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ బి. రాజు ఆధ్వర్యంలో వన మహోత్సవ…

Read More

ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతల నిర్మాణాలపై సమీక్ష

మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ భీంగల్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). భీంగల్ మండల పరిధిలో ఫామ్ పాండ్స్ (వ్యవసాయ క్షేత్రాల్లో నీటి నిల్వ గుంతలు), ఇంకుడు గుంతల నిర్మాణాలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి  సంతోష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరా క్రాంతి పథం CCలు, VAOలు, సంబంధిత సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రతి VAO పరిధిలో కనీసం రెండు ఫామ్ పాండ్స్‌ను…

Read More

మిలాద్ ఉన్ నబీ, పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన E6tv NEWS

మిలాద్ ఉన్ నబీ, పర్వదినాన్ని పురస్కరించుకుని E6tv NEWS ప్రేక్షకులందరికీ, మైనార్టీ సోదర సోదరీమణులందరికీ, ప్రజలందరికీ E6tv NEWS యాజమాన్యం, సిబ్బంది తరఫున హృదయపూర్వక పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు పవిత్రమైన మిలాద్ ఉన్ నబీ సందర్భంగా శాంతి, సోదరభావం, మానవత్వం, ఐక్యత వంటి విలువలు సమాజంలో మరింత బలపడాలని ఆకాంక్షించారు.అలాగే  ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వం, సిరిసంపదలను నింపాలని కోరుకున్నారు.మతాలు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, సోదరభావంతో పండుగలను…

Read More

మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వన మహోత్సవం

మద్నూర్, ఆగస్టు 25:(E6tv NEWS: ప్రతినిధి). ప్రతినిధిమండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మంగళవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ పీడీ కుటుంబరావు, సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు సూచించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు, భవిష్యత్…

Read More

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు బీజేపీ డిమాండ్

బాన్సువాడ, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి) రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల పక్షాన కార్యక్రమం నిర్వహించారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా “ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి.. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి” అంటూ నినాదాలు…

Read More

మద్నూర్ ప్రజావాణిలో వినతుల స్వీకరణ

మద్నూర్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎండీ ముజీబ్, ఎంపీవో సత్యనారాయణరెడ్డితో పాటు విద్యాశాఖ, పంచాయతీరాజ్, నీటిపారుదల, అటవీ, విద్యుత్, ఉపాధిహామీ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.ప్రజావాణిలో మేనూర్ గ్రామానికి చెందిన ఒక వినతిని స్వీకరించినట్లు ఎంపీడీవో సాయిలు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులో…

Read More

జమ్మికుంటలో అంగన్‌వాడీ చిన్నారులకు స్లేట్లు పంపిణీ

జమ్మికుంట, ఆగస్టు 24: (E6tv NEWS: ప్రతినిధి). కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 6వ వార్డు అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు స్లేట్లు, స్లేట్ పెన్సిళ్లను పంపిణీ చేశారు. 6వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు విద్యా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ స్వర్ణలతమాట్లాడుతూ.. చిన్నారుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అన్నారు. చిన్న వయస్సు నుంచే విద్యపై ఆసక్తి కలిగించడం ద్వారా వారి భవిష్యత్‌కు మంచి పునాది…

Read More

కోరపల్లి భూ వివాదంలో నకిలీ ఆర్‌ఓఆర్‌ పత్రాలపై ఉన్నతస్థాయి విచారణకు డిమాండ్

కరీంనగర్, ఆగస్టు 24: (E6tv NEWS: ప్రతినిధి). కోరపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో నకిలీ ఆర్‌.ఓ.ఆర్., 13(బి), 13(సి) సర్టిఫికెట్లు సృష్టించడంతో పాటు రెవెన్యూ రికార్డుల్లో ట్యాంపరింగ్‌కు పాల్పడిన వారిపై ఉన్నతస్థాయి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వెంకటేశ్వరపల్లికి చెందిన బోయిని లావణ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.కోరపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 553/ఎలో 4 ఎకరాల 32 గుంటల భూమిని తాను కొనుగోలు చేశానని లావణ్య తెలిపారు. తన పేరుపై మ్యూటేషన్‌…

Read More

22-A భూముల అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ నాయకులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి సవాల్

ఇందూరు, ఆగస్టు 23: (E6tv NEWS: శివ ఠాకూర్). 22-A భూముల అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. ఇందూరు జిల్లాలో ఎక్కడికి రమ్మన్నా తాను అక్కడికి వచ్చి చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ.. 22-A భూముల అంశంపై పూర్తి అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చర్చకు…

Read More