Breaking News

ప్రేమ వేధింపులు.. స్థానికుల చేతికి చిక్కిన నిందితుడు!

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న జుబేర్ అనే యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని గత కొంతకాలంగా వెంబడిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో నిందితుడి గత నేరచరిత్ర బయటపడింది. అతడు గతంలో హుజూరాబాద్‌లో నమోదైన పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించడంతో పాటు, అతనిపై రౌడీషీట్ తెరిచినట్లు పోలీసులు వెల్లడించారు. మహిళలు, యువతుల పట్ల వేధింపులకు పాల్పడితే తీవ్ర చట్టపరమైన చర్యలు తప్పవని, బాధితులు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *