Breaking News

కరెంట్ తీగలతో ప్రాణభయం: ఆరు నెలలుగా అధికారుల నిర్లక్ష్యం!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని అరపేట గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ కుటుంబాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. గ్రామానికి చెందిన హిమామ్ భి అనే మహిళ ఇంటి పైకప్పు మీదుగా ప్రమాదకరంగా విద్యుత్ తీగలు వెళ్తుండటంతో, ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ఆ కుటుంబం నరకం చూస్తోంది. ఆ తీగలను తొలగించాలని కోరుతూ గత ఆరు నెలలుగా విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు ఎంతమాత్రం స్పందించడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

తీగలను తొలగించాలంటే డబ్బులు కట్టాలని, లేకపోతే కుదరదని అధికారులు స్పష్టం చేసినట్లు ఆమె ఆరోపించారు. తమకు అంత ఆర్థిక స్థోమత లేకపోవడం వల్లే తీవ్ర ప్రాణాపాయంలో బతుకుతున్నామని, “తీగలను అయినా తొలగించండి లేదా నన్ను చంపేయండి” అంటూ ఆ బాధితురాలు కన్నీటిపర్యంతమయ్యారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తూ, ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *