Breaking News

కమ్యూనిస్టు నాయకుడు అంబటి విఠల్ గౌడ్ కుటుంబానికి MRPS నాయకుల పరామర్శ

కోటగిరి, అక్టోబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). కమ్యూనిస్టు పార్టీ జిల్లా నాయకుడు అంబటి విఠల్ గౌడ్ తల్లి లచ్చవ్వ ఇటీవల మృతి చెందడంతో MRPS నాయకులు గురువారం కోటగిరి మండల కేంద్రంలో వారి కుటుంబాన్ని పరామర్శించారు. లచ్చవ్వ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా MRPS జిల్లా నాయకుడు సోంపూర్ పోచిరాం మాదిగ, మండల అధ్యక్షుడు కే. పోశెట్టి పండు మాదిగ, హస్కుల శ్రీకాంత్ మాదిగ, కన్నం నితిన్ గైక్వాడ్, గంగాధర్ తదితర…

Read Full News

వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం

అర్హులైన ప్రతి ఒక్కరికీ కృత్రిమ అవయవాలు అందించడమే లక్ష్యం: పోచారం భాస్కర్ రెడ్డి బాన్సువాడ, అక్టోబర్ 11: (E6tv NEWS). వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడం, అవసరమైన ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే తన లక్ష్యమని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని అంగవైకల్యం ఉన్న వారికి వారి అవసరాలకు అనుగుణంగా కృత్రిమ చేతులు, కాళ్లు, ఇతర సహాయక పరికరాలు అందించాలనే సంకల్పంతో ప్రత్యేక సేవా…

Read Full News

ఇద్దరు అనారోగ్య బాధితులకు రూ.2.20 లక్షల ఎల్‌ఓసీలు అందజేత

బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, అక్టోబర్ 10 (E6TV న్యూస్: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు అనారోగ్య బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ.2.20 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) లెటర్లను బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు. బాల్కొండ మండలం బోడేపల్లి గ్రామానికి చెందిన అనికేష్ బాలయ్య వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ…

Read Full News

దళారీ వ్యవస్థ దెబ్బకు రైతులకు నష్టాలు!

రోజుకు రూ.100 చొప్పున తగ్గుతున్న ధాన్యం ధర రుద్రూరు, అక్టోబర్ 10 (E6TV న్యూస్: ప్రతినిధి). దళారీ వ్యవస్థ కారణంగా ధాన్యం ధరలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రుద్రూరు ప్రాంతానికి చెందిన రైతు గౌరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తగ్గిస్తున్నారని, దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా రైతు గౌరప్ప మాట్లాడుతూ.. నిన్నటి వరకు క్వింటాల్ ధాన్యానికి రూ.3,600 ధర…

Read Full News

బంజారా తండాలో విద్యుత్ సమస్యకు పరిష్కారం

సర్పంచ్ ధరావత్ సురేష్ చొరవతో నూతన 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్లారెడ్డి,అక్టోబర్ 10 (E6tv News): నాగిరెడ్డిపేట మండలంలోని బంజారా తండా గ్రామంలో గత కొంతకాలంగా నెలకొన్న విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామ సర్పంచ్ ధరావత్ సురేష్ చొరవతో విద్యుత్ అధికారులు గ్రామపంచాయతీ పరిధిలో నూతన 25 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. గ్రామంలో విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సర్పంచ్ ధరావత్ సురేష్ విద్యుత్ అధికారుల దృష్టికి…

Read Full News

పోషణ మాసం కార్యక్రమంలో ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా జ్యోతి అక్క స్వామికి అవార్డు

మోర్తాడ్, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్ జిల్లా స్థాయిలో నిర్వహించిన పోషణ మాసం–2026 కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం, మోర్తాడ్ మండలానికి చెందిన అంగన్వాడీ టీచర్ జ్యోతి  ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా అవార్డు అందుకున్నారు. అంగన్వాడీ సేవల్లో ఆమె అందిస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును జడ్జి ప్రదానం చేశారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, గర్భిణులు, బాలింతల సంక్షేమం, పిల్లల ఎదుగుదలకు సంబంధించిన కార్యక్రమాల అమలులో అంగన్వాడీ టీచర్ల పాత్ర ఎంతో కీలకమైనది. ఈ నేపథ్యంలో…

Read Full News

ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి ఫిర్యాదు

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన విపక్ష నేతలు న్యూఢిల్లీ, అక్టోబర్ 10: (E6tv NEWS). ఎన్నికల సంఘంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ ఇండియా కూటమి అగ్రనేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ మేరకు ఎన్నికల సంఘంపై తమ అభ్యంతరాలను వివరిస్తూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) ఎంపీ సుప్రియా…

Read Full News

ఏపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు రూ.25 లక్షల టోకరా!

తమది కాని భూమిని తమదిగా నమ్మించి మోసం చేసిన తండ్రీకొడుకులు భూమి విక్రయిస్తామంటూ అడ్వాన్స్ తీసుకుని మోసం.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఎమ్మెల్సీ ఫిర్యాదు హైదరాబాద్, అక్టోబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యను భూమి కొనుగోలు వ్యవహారంలో మోసగించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. మాదాపూర్‌లోని 100 ఫీట్ రోడ్డులో తమకు 5.5 ఎకరాల భూమి ఉందని నమ్మించి, విక్రయిస్తామంటూ రూ.25 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ఏపీ…

Read Full News

ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం,నేతలు

తెలంగాణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఎంగిలిపూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమైంది. ఈ తొమ్మిది రోజుల పాటు సాగే రాష్ట్ర ప్రజల అత్యంత ప్రియమైన పూల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖ నాయకులు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు మహిళలు ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలను వైభవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వివిధ…

Read Full News

పొతంగల్ పరిసరాల్లో జోరుగా ఇసుక అక్రమ రవాణా!

మంజీరా సరిహద్దు ప్రాంతం నుంచి యథేచ్ఛగా తరలింపు? బొలెరో వాహనాల్లో ఇసుక రవాణా.. అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు అధికారులు స్పందించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజల డిమాండ్ రుద్రూర్, అక్టోబర్ 10 (E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల మంజీరా నది సరిహద్దు ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రింబవళ్లు తేడా లేకుండా బొలెరో తదితర వాహనాల ద్వారా ఇసుకను…

Read Full News