Mahaboobnagar
నీళ్లు లేక ఎండుతున్న వరి పంట.. ట్యాంకర్లతో తడుపుతున్న రైతు
చివరి దశలో నీటి కొరతతో అన్నదాత ఆందోళన రెండు ఎకరాల సాగుకు రూ.50 వేల పెట్టుబడి.. పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటి సరఫరా నాగిరెడ్డిపేట, అక్టోబర్ 14 (E6 TV NEWS). పంట చేతికొచ్చే సమయంలో నీటి కొరత రైతును ఆందోళనకు గురిచేస్తోంది. వరి పంట చివరి దశకు చేరుకున్న వేళ సాగునీరు అందక పొలం ఎండిపోయే పరిస్థితి ఏర్పడటంతో ఓ రైతు పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. నాగిరెడ్డిపేట మండలం మెల్లకుంట తండాకు చెందిన…
మంచి అధికారులకు కష్టాలు తప్పవా?
రుద్రూర్లో వర్గపోరు.. నిబద్ధతతో పనిచేసే అధికారులకు ఇబ్బందులు తప్పవా? ఒకే పార్టీలో రెండు వర్గాలు.. పాలనపై ప్రభావం చూపుతున్నాయా? రుద్రూర్, అక్టోబర్ 14 (E6 TV News: శివ ఠాకూర్). రుద్రూర్ మండల కేంద్రంలో అధికారుల బదిలీలు, స్థానిక రాజకీయ వర్గపోరు అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసే అధికారులకు రాజకీయ విభేదాలు ఇబ్బందిగా మారుతున్నాయనే చర్చ స్థానికంగా వినిపిస్తోంది. మండలంలోని ఓ శాఖలో పనిచేసిన…
అటవీ అధికారులపై దాడి.. ఐదుగురి అరెస్ట్
హాజీపూర్ తండాలో ఘటన.. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు ఎల్లారెడ్డి, అక్టోబరు 13 (E6tv న్యూస్ ప్రతినిధి). కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండా పరిధిలో విధులు నిర్వహిస్తున్న అటవీ అధికారులపై దాడికి పాల్పడిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబరు 30న హాజీపూర్ అటవీ ప్రాంతంలో అటవీ బీట్ అధికారులు నాయకోటి శ్రీనివాస్, ప్రదీప్ విధులు నిర్వహిస్తుండగా, హాజీపూర్ తండాకు చెందిన కొందరు వ్యక్తులు వారి…
రాయసముద్రం చెరువు వద్ద దుర్గామాతకు ఘనంగా పూజలు
అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బీఆర్ఎస్ పటాన్చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి రామచంద్రపురం, అక్టోబర్ 13 (E6 NEWS ప్రతినిధి) రామచంద్రపురం 2,6,8వ డివిజన్ పరిధిలోని రాయసముద్రం చెరువు వద్ద కొలువుదీరిన దుర్గామాతకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఐదేళ్లుగా ఇక్కడ దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తూ భక్తులు అమ్మవారిని పూజిస్తున్నారు. అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్…
రేపు ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పర్యటన
మహిళా సంఘాల భవనాల ప్రారంభోత్సవాలు.. పలు గ్రామాల్లో జెండా కార్యక్రమాలు ఎల్లారెడ్డి, అక్టోబర్ 13 (E6tv NEWS ప్రతినిధి). ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ బుధవారం, అక్టోబర్ 14న ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ పర్యటనలో మహిళా సంఘాల భవనాల ప్రారంభోత్సవాలతో పాటు పలు గ్రామాల్లో జెండా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మహిళా సంఘాల భవనాల ప్రారంభోత్సవాలు కొక్కొండ, లక్ష్మాపూర్, బిక్కనూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన మహిళా సంఘాల…
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం
భిక్కనూర్‌లో ముగ్గు పోసే కార్యక్రమం ఎల్లారెడ్డి, అక్టోబర్ 13 (E6tv న్యూస్: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని భిక్కనూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు మంగళవారం భిక్కనూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో భాగంగా ముగ్గు పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు.పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అధికారులు,…
మాలల రిజర్వేషన్లపై రోస్టర్ పాయింట్ల సవరణకు ధర్నా
మాలల ఉద్యోగ నియామకాల్లో న్యాయం చేయాలి రిజర్వేషన్ల అమలులో మార్పులు చేపట్టా అక్టోబర్ 15న నిజామాబాద్‌లో ధర్నాకు మాల మహానాడు పిలుపు నిజామాబాద్, అక్టోబర్ 12 (E6 TV News) మాలల రిజర్వేషన్లకు సంబంధించి రోస్టర్ పాయింట్ల సవరణ చేపట్టి, ఉద్యోగ నియామకాల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ నెల 15న నిజామాబాద్‌లో ధర్నా నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు, జిల్లా ప్రెసిడెంట్ దేవదాస్ ప్రకటించారు. గురువారం ఉదయం 10 గంటలకు…
ఎల్లారెడ్డిలో దసరా ఆఫర్ల జోరు!
బట్టలు కొంటే బైక్‌లు, బంగారం గెలుచుకునే అవకాశం.. కూపన్లతో వినియోగదారులకు ఆకర్షణ ఎల్లారెడ్డి, అక్టోబర్ 11 (E6tv News ప్రతినిధి): దసరా పండుగ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలో బట్టల దుకాణాలు ప్రత్యేక ఆఫర్లతో కళకళలాడుతున్నాయి. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు పోటాపోటీగా డిస్కౌంట్లు, కూపన్లు, బంపర్ డ్రాలు, ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. దీంతో పట్టణంలోని ప్రధాన వస్త్ర దుకాణాలకు కొనుగోలుదారుల రద్దీ పెరిగింది. బట్టలు కొంటే బహుమతులు! పట్టణంలోని పలు వస్త్ర దుకాణాలు…
సోమిర్యాగడి తండాలో మద్యపాన నిషేధానికి ఏకగ్రీవ తీర్మానం
మద్యం విక్రయిస్తే రూ.10 వేల జరిమానా.. సేవిస్తే రూ.5 వేల జరిమానా ఎల్లారెడ్డి, అక్టోబర్ 11 (E6TV న్యూస్). మద్యపానం వల్ల కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో మద్యపానాన్ని నియంత్రించేందుకు సోమిర్యాగడి తండా గ్రామస్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమిర్యాగడి తండాలో మద్యపాన నిషేధం అమలు చేయాలని గ్రామ పంచాయతీ ప్రత్యేక సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆదివారం గ్రామ సర్పంచ్ మాలోత్ ప్రియాంక అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ పెద్దలు,…
పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 275 మందికి రూ.2.75 కోట్లకు పైగా ఆర్థిక సాయం నిజామాబాద్ అర్బన్, అక్టోబర్ 11 (E6TV NEWS). పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద…
