Breaking News

బాధితురాలి వైద్య చికిత్సకు రూ. 2 లక్షల ఎల్‌ఓసీ అందజేత

జాన జమునకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచన వేల్పూర్, సెప్టెంబర్ 15: (E6 టీవీ న్యూస్). అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన జాన జమున వైద్య ఖర్చుల నిమిత్తం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ. 2 లక్షల ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. ఈ మేరకు ఎల్‌ఓసీ పత్రం కాపీని వేల్పూర్‌లో బాధితురాలి కుటుంబ…

Read Full News

అచ్చంపేట, మల్లూరు PACS చైర్మన్ల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

రైతు సంక్షేమం, సహకార రంగ అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నిజాంసాగర్, అక్టోబర్ 15 (E6 టీవీ న్యూస్). కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, మల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) నూతన చైర్మన్ల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం గోర్గల్ సొసైటీ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట PACS చైర్మన్‌గా పట్లోళ్ల జనార్దన్ రెడ్డి, మల్లూరు PACS చైర్మన్‌గా భుజంగారి వినోద వెంకట్రామిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు….

Read Full News

జాతీయ స్థాయి మహిళా క్రికెట్ ఛాంపియన్‌షిప్‌కు ఉట్‌పల్లి గిరిజన ఆణిముత్యం

తెలంగాణ జట్టు తరఫున బరిలోకి దిగనున్న జయ మనోజ్ఞ నాయక్‌.. గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలు నిజామాబాద్, అక్టోబర్ 15 (E6 టీవీ న్యూస్). నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఉట్‌పల్లి గ్రామానికి చెందిన గిరిజన యువ క్రికెటర్ జయ మనోజ్ఞ నాయక్ జాతీయ స్థాయి మహిళా క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైంది. గ్రామానికి చెందిన రూడావత్ జయ పవన్ దంపతుల కుమార్తె అయిన మనోజ్ఞ నాయక్ తన ప్రతిభతో జాతీయ స్థాయికి ఎదగడం పట్ల గ్రామ ప్రజలు…

Read Full News

రాయసముద్రం చెరువు బతుకమ్మ ఘాట్‌లో బురద, చెత్తాచెదారం!

అధికారుల నిర్లక్ష్యంపై మహిళల ఆవేదన.. రెండు రోజుల్లో శుభ్రం చేయకపోతే ధర్నా చేస్తాం: మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య రామచంద్రపురం, అక్టోబర్ 14 (E6 న్యూస్ ప్రతినిధి) రామచంద్రపురంలోని రాయసముద్రం చెరువు వద్ద ఉన్న బతుకమ్మ ఘాట్ బురద, చెత్తాచెదారంతో అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘాట్‌ను పట్టించుకునే వారే కరువయ్యారని మహిళలు వాపోతున్నారు. ఇటీవల పోచమ్మ గుడిలో నిర్వహించిన దుర్గామాత అన్నదాన కార్యక్రమం సందర్భంగా మహిళలు ఈ సమస్యను మాజీ కార్పొరేటర్ తొంట…

Read Full News

వర్ని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

రూ.10.70 కోట్లతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం వర్ని, అక్టోబర్ 14 (E6tv NEWS: శివ ఠాకూర్) కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నూతనంగా నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రూ.10 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రిని బుధవారం ఆయన…

Read Full News

మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంలో భారత్ అభివృద్ధి పథంలో పయనం

కేంద్ర పథకాలతో కోట్లాది మందికి లబ్ధి ‘చాయ్ మిలన్ @ మోదీ జీ 25’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఇందూరు, అక్టోబర్ 14 (E6 TV NEWS: శివ ఠాకూర్). ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, ప్రపంచంలో విశ్వగురువుగా నిలిచే దిశగా పయనిస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఇందూరులోని…

Read Full News

ఎన్‌సీసీ క్యాడెట్లలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించాలి

550 మంది క్యాడెట్లకు వార్షిక శిక్షణ శిబిరం డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి నిజామాబాద్ అక్టోబర్ 14 (E6tv NEWS: శివ ఠాకూర్). యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ఎన్‌సీసీ కీలక పాత్ర పోషిస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అన్నారు. నిజామాబాద్‌లోని సీటీసీ (CTC)లో 12వ బెటాలియన్ ఎన్‌సీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక శిక్షణ శిబిరంలో బుధవారం ఆయన ముఖ్య…

Read Full News

తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారనుండటంతో అక్టోబర్ 15 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల కొన్ని రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30 నుంచి…

Read Full News

నియోజకవర్గ అభివృద్ధికి స్పెషల్ ఫండ్ కేటాయించాలి

26వ డివిజన్‌లో రోడ్డు పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఇందూరు, అక్టోబర్ 14 (E6 న్యూస్: శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు (స్పెషల్ ఫండ్) కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కోరారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. నగరంలోని 26వ డివిజన్‌లో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ భూమిపూజ చేశారు….

Read Full News

మూడు దశాబ్దాలుగా సంప్రదాయబద్ధంగా దేవీ నవరాత్రి వేడుకలు

మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు పటాన్‌చెరు, అక్టోబర్ 14 (E6 న్యూస్ ప్రతినిధి). పటాన్‌చెరు పట్టణంలోని మైత్రి గ్రౌండ్‌లో మహంకాళి దేవాలయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. మాజీ కార్పొరేటర్ సఫాన్ దేవ్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వేడుకల్లో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని…

Read Full News