Mahaboobnagar
పండించింది సన్నధాన్యమే.. ధర మాత్రం రూ.3,300
సిండికేట్‌గా ఏర్పడి ధాన్యం ధరలు తగ్గిస్తున్నారని రైతు బాపురావు ఆవేదన బాన్సువాడ, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) తాను పండించిన సన్నధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం లేదని రైతు బాపురావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సన్నధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.3,300 చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.ఈ సందర్భంగా రైతు బాపురావు మాట్లాడుతూ.. తాను పండించినది సన్నధాన్యమేనని, అయితే బియ్యం సరిగా రాదనే కారణంతో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, ఇతర…
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
ఎన్నికల పారదర్శకతపై కాంగ్రెస్ ఆందోళన.. భైంసా సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం భైంసా, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి). ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల జాబితాలో అవకతవకల ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని కోరుతూ భైంసాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెద్మ బొజ్జు…
రాహుల్ గాంధీపై లాఠీచార్జిని నిరసిస్తూ రాస్తారోకో
కమ్మర్‌పల్లిలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన కమ్మర్‌పల్లి, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) ఢిల్లీలో ఓటు చోరీ అంశంపై జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నాయకులపై లాఠీచార్జి జరిగిందని ఆరోపిస్తూ కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెం గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఓటు…
బోధన్‌లో బార్ అండ్ రెస్టారెంట్‌కు నోటిఫికేషన్
రూ.1 లక్ష దరఖాస్తు రుసుము.. వార్షిక రుసుము రూ.42 లక్షలు నిజామాబాద్, అక్టోబర్ 8 (E6tv NEWS: శివ ఠాకూర్). బోధన్ పట్టణంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్, ఐఏఎస్ ఉత్తర్వుల మేరకు ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి కె.జి. నందగోపాల్ తెలిపారు. ఆసక్తి గల దరఖాస్తుదారులు రూ.1 లక్ష దరఖాస్తు రుసుము చెల్లించి, ఆధార్…
ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటా
వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఆధారాలతో నిరూపించాలి.. నిజనిర్ధారణ కమిటీ వేయాలి రాజకీయాలు, వ్యాపారాన్ని ముడిపెట్టడం సరికాదు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి నిజామాబాద్: అక్టోబర్ 8:(E6tv NEWS: శివ ఠాకూర్).తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని, ప్రస్తుతం రైస్ మిల్ నిర్వహిస్తూ, రైతులకు అండగా నిలుస్తున్నానని పేర్కొంటూ, తనపై వస్తున్న వ్యక్తిగత, రాజకీయ ఆరోపణలపై రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వడ్డీ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తనపై రెచ్చగొట్టే…
దశలవారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
ఇండ్ల మంజూరులో దళారులను ఆశ్రయించవద్దు: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసా, అక్టోబర్ 7 (E6tv NEWS: ప్రతినిధి). అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని, ఇళ్లు మంజూరు కాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భైంసా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. బుధవారం భైంసా ఎంపీడీవో కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన 175 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…
కాపు భవన్ నిర్మాణానికి చర్యలు చేపడతాం: హరీష్ బాబు
మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో స్థల పరిశీలన ధర్మవరం, అక్టోబర్ 7 (E6tvNEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో కాపు భవన్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు తెలిపారు. బుధవారం పోతుకుంట రోడ్డులోని డీఎస్పీ గెస్ట్‌హౌస్ సమీపంలో కాపు భవన్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ధర్మవరం శ్రీకృష్ణదేవరాయల బలిజ సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘం…
రైతుల కష్టాలను మాజీ మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్
వర్ని, అక్టోబర్ 7 (E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్ జిల్లా వర్ని మండల పరిధిలోని సిద్దాపూర్ గ్రామంలో నీటి కొరతతో ఎండిపోతున్న వరి పంటలను ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ రెండు రోజుల క్రితం పరిశీలించారు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు ఎత్తిపోతున్నా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో మోరిల్ శ్రీనివాస్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి కొరత,…
దసరా, బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
జగిత్యాల, అక్టోబర్ 07 (E6tvNEWS: ప్రతినిధి)దసరా నవరాత్రోత్సవాలు, సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని నంబి వేణుగోపాల చార్య కౌశిక కోరారు. ఈ మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్యప్రణవ్‌ను కలిసి అవసరమైన ఏర్పాట్లపై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 11న శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమై, అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 20న దసరా పండుగ నిర్వహించనున్నట్లు…
జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి
నిజామాబాద్ ధర్నా చౌక్‌లో ఇండియా కూటమి ధర్నా.. అనంతరం దిష్టిబొమ్మ దహనం నిజామాబాద్, అక్టోబర్ 07: (E6tv NEWS: శివ ఠాకూర్): ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్…
