Breaking News

బోధన్‌లో నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్

బోధన్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌లో నకిలీ ప్రభుత్వ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నకిలీ మీ సేవ సర్టిఫికెట్లు, రబ్బర్ స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. రాకాసిపేట్ పెద్ద మసీదు సమీపంలోని సహారా మీ సేవ కేంద్రంలో నకిలీ ప్రభుత్వ ధ్రువపత్రాలు తయారు చేస్తున్నారనే సమాచారం అందడంతో…

Read More

భీంగల్‌లో కాంగ్రెస్ 1000 రోజుల ప్రజాపాలన విజయోత్సవం

భీంగల్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీ ఆదివారం భీంగల్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ, సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్, డీసీసీ అధ్యక్షుడు కట్పల్లి నగేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో…

Read More

అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

నాగేంద్రనగర్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల మంజూరు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హత పొందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సందె రంజిత్ మాట్లాడుతూ.. పేద, అర్హత కలిగిన కుటుంబాలకు రేషన్ కార్డు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వ గుర్తింపు పత్రంగా నిలుస్తుందని తెలిపారు….

Read More

ఉనికి కోసమే బీఆర్ఎస్ నాయకుల ఆరాటం

ప్రజా సంక్షేమంపై మరింత నిబద్ధతతో ముందుకు వెళ్తాం: మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)  బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలిపారు….

Read More

విద్యార్థులకు బూట్లు, సాక్సుల పంపిణీ

ఏర్గట్ల, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) . ఎర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బూట్లు, సాక్సులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులు యూనిఫామ్‌లో చక్కగా కనిపించడంతో పాటు క్రమశిక్షణతో పాఠశాలకు హాజరయ్యేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బూట్లు, సాక్సులు అందజేస్తోందన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు బూట్లు, సాక్సులు ధరించి రావాలని సూచించారు. యూనిఫామ్‌ను సక్రమంగా ధరించడం, బూట్లు వేసుకోవడం,…

Read More

వానల్లేక ఎండిపోతున్న నాట్లు: నిజాంసాగర్ నీటిని విడుదల చేయాలని బీజేపీ డిమాండ్!

బోధన్ (నిజామాబాద్): ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పోవడంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని, రైతులను ఆదుకునేందుకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని బీజేపీ బోధన్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలీసాగర్ జలాశయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వడ్డీ మోహన్ రెడ్డి వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు: ప్రభుత్వం జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి సాగునీటిని విడుదల చేసి రైతాంగానికి భరోసా…

Read More

కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ ఉక్కుపాదం

నిజామాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన విఫలమైందంటూ నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ శ్రేణులు చేపట్టిన ఆందోళనలు రెండో రోజూ హోరెత్తాయి. నగరంలోని ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ‘కాంగ్రెస్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తీవ్ర విమర్శలు: వరుస నిరసనలతో నిజామాబాద్ జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

Read More

శిరీష హత్యాచార ఘటనపై నిందితుడిని కఠినంగా శిక్షించాలి

కొవ్వొత్తుల ర్యాలీ, మానవహారం నిర్వహించిన ఇల్లందు కాంగ్రెస్ శ్రేణులు ఇల్లందు: హైదరాబాద్‌లోని ప్రైమ్ కేర్ హాస్పిటల్‌లో నర్సుగా విధులు నిర్వహిస్తున్న ఊకే శిరీష పై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి జగదాంబ సెంటర్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగదాంబ…

Read More

ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం: గణేష్ బిగాల

నిజామాబాద్, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ బైక్ ర్యాలీ సెప్టెంబర్ 5న ఉదయం 10:30 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి ప్రారంభం కానుంది. యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఎన్నికల సమయంలో…

Read More

బల్దియా ఉద్యోగుల మెడకు  అవుట్సోర్సింగ్ ఉచ్చు!

జమ్మికుంట, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి).జమ్మికుంట బల్దియా ఉద్యోగుల మెడకు అవుట్సోర్సింగ్ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై ఆధారాలు సేకరించి చర్యలు తీసుకునేందుకు అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ఉద్యోగుల వ్యవహారాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ కార్యాలయంలో ఉద్యోగుల పనితీరు, గతంలో జరిగిన వ్యవహారాలపై అధికారులు ఆరా…

Read More