Breaking News

అశోక్ సాగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

లారీ ఢీకొని తల్లి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు నిజామాబాద్, జూలై 12 (E6 క్రైమ్ న్యూస్):నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జానకంపేట్ గ్రామ సమీపంలోని అశోక్ సాగర్ వద్ద బోధన్–నిజామాబాద్ ప్రధాన రహదారిపై లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. జానకంపేట్ గ్రామానికి చెందిన మారా కమల తన కుమారుడు అవీష్‌తో కలిసి…

Read More

కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బిఆర్ఎస్ నేతలు

కోటగిరి జూలై 12 :E6 న్యూస్:కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండిస్తూ, తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థవంతంగా వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సాగునీటి అవసరాలను తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఉపయోగించి, రైతులకు తక్షణమే సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని…

Read More

తెలంగాణకు ఎండల ఎఫెక్ట్…!

జూలై 15 వరకు పొడి వాతావరణం కొనసాగే సూచనలు 16-19 మధ్య అక్కడక్కడా తేలికపాటి ఉరుములు, జల్లులు మాత్రమే..! హైదరాబాద్, జూలై 12: E6 న్యూస్తెలంగాణలో జూలై రెండో వారం నుంచి వాతావరణం అసాధారణంగా వేడిగా మారింది. సాధారణంగా ఈ సమయంలో విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలను తలపించేలా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. నేడు నమోదయ్యే ఉష్ణోగ్రతలు వాతావరణ పరిస్థితులపై అందుబాటులో ఉన్న…

Read More

పేదల ఆరోగ్యానికి పెద్దపీట నిమ్స్ చికిత్సకు రూ. 5 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

ఇందూరు, జూలై 12: E6 న్యూస్ శివ ఠాకూర్ నియోజకవర్గంలోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, అవసరమైన వారికి నిమ్స్‌లో చికిత్స కోసం ఎల్వోసీలు (LOC) మంజూరు చేస్తున్నామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు.ఆదివారం నగరంలోని తన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆటోనగర్‌కు చెందిన మూడున్నరేళ్ల చిన్నారి ఉమ్మే కుర్సుం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో ఆమె చికిత్స నిమిత్తం రూ.5 లక్షల విలువైన ఎల్వోసీని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే…

Read More

గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైంది: అమరవేణి నర్సాగౌడ్ హుస్నాబాద్ జూలై 11: E6 న్యూస్ గౌడ కులస్తులకు ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి “మోకు దెబ్బ” జాతీయ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ డిమాండ్ చేశారు.గౌడ కులస్తులకు ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి “మోకు దెబ్బ”…

Read More

మహిళ మెడలో నుంచి మంగళసూత్రం చోరీ.. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్, జూలై 11: E6 న్యూస్ క్రైమ్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్-3 పోలీస్ స్టేషన్ పరిధిలో దుబ్బ ప్రాంతంలో మహిళ మెడలో నుంచి మంగళసూత్రం, కమ్మలు అపహరించిన ఘటనపై పోలీస్ కమిషనర్ పీ. సాయి చైతన్య, ఐపీఎస్ శనివారం సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితురాలితో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్న కమిషనర్, దర్యాప్తు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ…

Read More

హుస్నాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి గౌడ సంఘం సమావేశానికి పెద్ద ఎత్తున హాజరు కావాలి.

పెద్ద ఎత్తున మమేకమై, గౌడ సంఘాల ఐక్యతను చాటాలి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చేపూరి కనక గౌడ్ పిలుపు నిర్మల్, జూలై 12: E6న్యూస్ తిరుపతి గౌడ్:హుస్నాబాద్‌లో ఆదివారం నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి గౌడ సంఘం సమావేశాన్ని విజయవంతం చేయాలని నిర్మల్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు చేపూరి కనక గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి గౌడ సంఘం నాయకులు, ప్రతినిధులు, గౌడ సోదరులు ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు….

Read More

తాళ్ల రాంపూర్ సర్పంచ్ పావని కుటుంబాన్ని పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి

ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా పావని మరణం గ్రామానికి తీరని లోటు : మానాల మోహన్ రెడ్డి ఏర్గట్ల జూలై 11: E6 న్యూస్ తాటికొండ గంగాధర్బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ కీర్తిశేషులు బెజ్జారం పావని ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శనివారం పావని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా…

Read More

స్వగ్రామంలో SIR పత్రాలు సమర్పించిన అడిషనల్ కలెక్టర్ సోమ రాజేశ్వరరావు

కుటుంబ సభ్యుల ఫారాలను బీఎల్‌ఏ, బీఎల్‌ఓ, సూపర్వైజర్లకు అందజేత మోర్తాడ్, జూలై 11: E6 న్యూస్ శివ ఠాకూర్ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. ప్రజలు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించి ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించేందుకు సహకరించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ముందుగా స్వయంగా…

Read More

అంగన్వాడి పోస్టుల్లో రిజర్వేషన్ రగడ…!

బీసీ మహిళలకు దక్కని అవకాశం..? సొంత గ్రామ నిబంధనతో దరఖాస్తుకే నోచుకోని నిరుద్యోగ మహిళలు పక్క గ్రామంలో పోస్టు ఉన్నా అప్లై చేయలేని పరిస్థితి..! ఏళ్లుగా ఎదురుచూస్తున్న బీసీ మహిళలకు నిరాశేనా..? రిజర్వేషన్ ప్రక్రియపై పునరాలోచించాలంటున్న బీసీ సంఘాలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూపులు స్పెషల్ స్టోరీ ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా విడుదలైన అంగన్వాడీ…

Read More