నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో వ్యవసాయ విద్యుత్ కోతలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. పంటలకు రోజుకు కేవలం ఏడు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నప్పటికీ, అది కూడా సక్రమంగా రాకపోవడంతో సాగు పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి వ్యవసాయానికి నిర్ణీత సమయం మేరకు ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలని వారు డిమాండ్ చేశారు.

