Breaking News

బాసర ఐఐఐటీలో విద్యార్థి అదృశ్యం కలకలం.. నాందేడ్‌లో క్షేమంగా లభ్యం

బాసర, జూలై 31 (E6 tv న్యూస్): A, తిరుపతి గౌడ్. నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ-ఐఐఐటీ)లో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన యశ ఋషింద్ర రెడ్డి శుక్రవారం ఉదయం నుంచి కనిపించకుండా పోవడంతో కళాశాల అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు.విద్యార్థి తల్లిదండ్రులను సంప్రదించిన అనంతరం కళాశాల అధికారులు ఉదయం అతనికి అవుట్‌పాస్ మంజూరు చేశారు. అనంతరం యశ…

Read More

ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ రైల్వే లైన్‌కు కేంద్రం సానుకూల స్పందన

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు – ప్రాజెక్ట్ అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ న్యూఢిల్లీ/నిర్మల్, జూలై 31 (E6TV): Md, అమీనుద్దీన్.ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకంగా భావిస్తున్న ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ అమలుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన అమలు చేయాలని కోరుతూ తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు….

Read More

రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈ-కేవైసీ గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు!

హైదరాబాద్: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది. రేషన్ కార్డుల ఈ-కేవైసీ (e-KYC) నమోదు ప్రక్రియ ఆఖరి గడువును ఆగస్టు 31, 2026 వరకు పొడిగిస్తూ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతుండటంతో పాటు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ జరుగుతుండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ గడువును పెంచినట్లు అధికారులు వెల్లడించారు. దీనితో పాటు…

Read More

ఆపదలో ఆపద్బాంధవుడిగా మాజీ ఉప సర్పంచ్ గడ్డం సుభాష్

భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సమయాల్లో ఉచిత వాహన సేవ ప్రకటింపు ముథోల్, జూలై 30: E6 tv NEWS(ఆకుల తిరుపతి గౌడ్): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాలని మాజీ ఉప సర్పంచ్, సామాజిక కార్యకర్త గడ్డం సుభాష్ నిర్ణయించారు. ప్రజా సేవే తన లక్ష్యమని పేర్కొంటూ, మండల కేంద్రం ముథోల్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అవసరమైన సమయంలో ఉచిత వాహన సేవ అందించేందుకు ఎల్లప్పుడూ…

Read More

లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టొద్దు: కల్వకుంట్ల కవిత

ప్రభుత్వ ఈవీ ఆటోల నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం ప్రస్తుతం ఆటోలు నడుపుతున్న వారికే అవకాశం కల్పించాలని డిమాండ్ ఆటో డ్రైవర్లకు అండగా ఉద్యమిస్తామని తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక హైదరాబాద్, జూలై 30: E6 tv NEWS ప్రతినిధి. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఉపాధిపై దెబ్బకొట్టే విధంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో సమావేశమైన ఆమె,…

Read More

SIR ప్రక్రియను జిల్లాలో 100 శాతం పూర్తి చేయాలి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్, జూలై 30: E6 tv NEWS ప్రతినిధి. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను దాదాపు 100 శాతం పూర్తి చేసేలా బీఎల్ఏలు సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి సూచించారు.శుక్రవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు కాట్‌పల్లి నాగేష్ రెడ్డి అధ్యక్షతన జిల్లా PAC సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని…

Read More

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షల నేపథ్యంలో సెక్షన్ 163 BNSS అమలు

ఆగస్టు 2న పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్, జూలై 30: E6 tv NEWS. టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ (TTC) ఆగస్టు–2026 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్–163 కింద నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనరేట్ వెల్లడించింది.ఆగస్టు 2 (ఆదివారం) నిర్వహించే పరీక్షల సందర్భంగా నిజామాబాద్…

Read More

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఇందూరు, జూలై 30: E6 tv NEWS (శివ ఠాకూర్) గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించారు. నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది డ్రైనేజీలు, నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ కాకుండా తగిన చర్యలు…

Read More

హైడ్రాకు పూర్తి మద్దతు ప్రకటించిన ధర్మపురి సంజయ్

హైదరాబాద్ అభివృద్ధి, ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా చర్యలు అభినందనీయం ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి నిజామాబాద్ జూలై 30: (E6 tv NEWS శివ ఠాకూర్). ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న హైడ్రా (HYDRAA) చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నాయకుడు ధర్మపురి సంజయ్ ప్రకటించారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, చెరువులు, నాలాలు, ప్రభుత్వ…

Read More

భారీ నుంచి అతి భారీ వర్షాలు.. నిర్మల్ జిల్లాలో నేడు అన్ని పాఠశాలలకు సెలవు

విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటింపు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు జిల్లా యంత్రాంగం హెచ్చరిక వాగులు, వంకలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచన నిర్మల్, జూలై 30: E6 tv NEWS (Md, అమీనుద్దీన్). నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ నేడు జిల్లాలోని…

Read More