Breaking News

టౌన్-3 పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, డ్రగ్స్‌పై విస్తృత అవగాహన కల్పించాలి నిఘా వ్యవస్థ పటిష్టం చేసి ట్రాఫిక్, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలి నిజామాబాద్, జూలై 28 (E6 tv NEWS ప్రతినిధి): ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సూచించారు. మంగళవారం టౌన్-3 పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ…

Read More

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి,లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి

నిజామాబాద్, జూలై 28: (E6 tv NEWS) రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి భారీ ఆందోళనలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు.ఇందూరు బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ, మిస్ కాల్ ఉద్యమాన్ని మంగళవారం ప్రారంభించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్…

Read More

ఎస్సారెస్పీ (SRSP) ప్రాజెక్ట్‌లో విషాదం.. నలుగురు యువకులు నీటమునిగి మృతి, ముగ్గురి మృతదేహాలు లభ్యం!

నిజామాబాద్ / హైదరాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (SRSP) వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రాజెక్ట్ జలాశయ ప్రాంతంలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. మంగళవారం నాటికి ముగ్గురు యువకుల మృతదేహాలను నీటి నుంచి వెలికితీయగా, మరో యువకుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటన వివరాలు & ప్రాంతాలు: ఎస్సారెస్పీ…

Read More

భీంగల్‌లో జల శక్తి అభియాన్–జన భాగీదారి కార్యక్రమం

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నీటి సంరక్షణపై అవగాహన “క్యాచ్ ది రైన్” కార్యక్రమంతో భూగర్భ జలాల పరిరక్షణకు పిలుపు సీజనల్ వ్యాధుల నివారణపై మున్సిపల్ కమిషనర్ సూచనలు భీంగల్, జూలై 28: E6 tv NEWS,(T, గంగాధర్)కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సీడీఎంఏ (CDMA) ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో “జల శక్తి అభియాన్–జన భాగీదారి (JSJB–3.0)” కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. భీంగల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ…

Read More

తెలంగాణలో 1 లక్ష దాటిన షోరూమ్‌ వెహికల్ రిజిస్ట్రేషన్లు.. ఆర్‌టీఏ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పినట్టే!

హైదరాబాద్: వాహన కొనుగోలుదారులకు రవాణా శాఖ అందించిన ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ (Dealer Point Registration) విధానం కొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఏడాది జనవరి చివరి వారంలో ప్రారంభించిన ఈ సేవల ద్వారా షోరూమ్‌లలోనే పూర్తయిన నాన్-కమర్షియల్ (సొంత) వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య 1 లక్ష దాటింది. కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత ఆర్‌టీఏ (RTA) కార్యాలయాల చుట్టూ గంటల తరబడి తిరిగే అవసరం లేకుండా, షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆర్‌సి…

Read More

తిర్మాన్‌పల్లి మైనారిటీ కమ్యూనిటీ హాల్‌కు రూ.5 లక్షల నిధులు

ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందజేత.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి నిజామాబాద్, జూలై 28: E6 tv NEWS (శివ ఠాకూర్). అన్ని వర్గాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం తిర్మాన్‌పల్లి గ్రామంలో మైనారిటీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరు చేయగా, అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను…

Read More

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షల ఎల్‌ఓసీ అందజేత

భీంగల్, జూలై 27: E6 tv NEWS, (T, గంగాధర్.) భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన చిలివేరి నాగేష్ (తండ్రి: నాగయ్య) తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం కోసం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్‌ను సంప్రదించారు.విషయాన్ని పరిశీలించిన ముత్యాల సునీల్ కుమార్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధితుడికి రూ.3,00,000 విలువైన…

Read More

గంజాయి సరఫరా నెట్‌వర్క్‌లపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం

ఏడాదిలో 7 టన్నుల గంజాయి స్వాధీనం – అంతర్‌రాష్ట్ర ముఠాలపై ఉమ్మడి ఆపరేషన్లు NCB, DRI, పొరుగు రాష్ట్రాల పోలీసులతో సంయుక్త దాడులు ఆల్ప్రాజోలమ్, గంజాయి కేసుల్లో భారీ స్వాధీనం – RNCC కఠిన చర్యలు 165 మంది వినియోగదారులకు డీ-అడిక్షన్ చికిత్స – 492 అవగాహన కార్యక్రమాలు యాంటీ డ్రగ్ సోల్జర్”గా ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలి: పోలీసులు నిజామాబాద్ జూలై 27:E6 tv NEWS శివ ఠాకూర్. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా,…

Read More

భీంగల్ మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం

భీంగల్, జూలై 27: (E6 tv NEWS, T, గంగాధర్) భీంగల్ మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న కోట నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులను మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, కౌన్సిలర్లు పరామర్శించారు. ఈ సందర్భంగా నర్సయ్య అంత్యక్రియల నిర్వహణ కోసం మున్సిపాలిటీ తరఫున రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారు, కుటుంబానికి అండగా ఉంటామని…

Read More

తెలంగాణలో పుష్కలంగా ఎరువుల నిల్వలు.. అక్రమార్కులపై కఠిన చర్యలు: కేంద్రమంత్రి జేపీ నడ్డా!

హైదరాబాద్ / న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో (2026) తెలంగాణకు అవసరమైన ఎరువుల సరఫరా తగినంతగా అందుబాటులో ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంట్‌లో వెల్లడించారు. లోక్‌సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వక సమాధానమిచ్చారు. ఎరువుల నల్లబజారు (బ్లాక్ మార్కెటింగ్), దారి మళ్లింపును అరికట్టేందుకు ఎస్సెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ (EC Act, 1955) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్…

Read More