Breaking News

బస్వాపూర్‌లో చాకలి ఐలమ్మ 131వ జయంతి

జుక్కల్ మండలం, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో చాకలి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి వేడుకలను గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వి. రమణ సురేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి భారద్వాజ్, వార్డు సభ్యులు శివాజీ పటేల్, సంగ్రామ్, హైదర్ సాబ్, నాగనాథ్, షాదుల్, ఫీల్డ్ అసిస్టెంట్ బి. రాజు, కారోబార్ ఎం. గంగారం పాల్గొన్నారు.అలాగే రజక…

Read Full News

ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరుబాట

ఓటు హక్కు పరిరక్షణ కోస 28న కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా కామారెడ్డి, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి) ఓటు హక్కు పరిరక్షణ, పారదర్శకమైన ఓటర్ల జాబితా కోసం కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టనుంది. SIR ప్రక్రియ, ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఈ నెల 28న కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. TPCC ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టరేట్ ఎదుట…

Read Full News

మోడల్ కాలనీలో రూ.22 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ

హిందూపురం, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని మోడల్ కాలనీలో రూ.22 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. మాజీ కౌన్సిలర్, బీజేపీ హిందూపురం పట్టణ అధ్యక్షురాలు అంజలి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతినిధి సురేంద్ర, వ్యక్తిగత కార్యదర్శి బాలాజీ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మాజీ చైర్మన్ డీఈ రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు రమేష్ రెడ్డి,…

Read Full News

మౌంట్ తరంగ్-II అధిరోహించిన కామారెడ్డి గిరిజన సంక్షేమ కళాశాల విద్యార్థి

కామారెడ్డి, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి) హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్–స్పితి జిల్లాలో మియార్ లోయలో ఉన్న 6,027 మీటర్ల ఎత్తైన మౌంట్ తరంగ్-II శిఖరాన్ని కామారెడ్డి గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి విస్లావత్ బన్నీ విజయవంతంగా అధిరోహించారు. పది మంది సభ్యులతో కూడిన ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్ భారతీయ పర్వతారోహణ బృందంలో బన్నీ సభ్యుడిగా పాల్గొని ఈ ఘనత సాధించారు. శిఖరాగ్రంపై భారత జాతీయ త్రివర్ణ పతాకంతో పాటు తెలంగాణ గిరిజన సంక్షేమ విద్యా సంస్థ కళాశాల…

Read Full News

ఇరవైత్రి అనిల్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా

కమ్మర్‌పల్లి, సెప్టెంబర్ 26: (E6tv NEWS: ప్రతినిధి). రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఇరవైత్రి అనిల్ కుమార్ జన్మదిన వేడుకలను కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనిల్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ పాలేపు నర్సన్న, వీసీ బుచ్చన్న, మాజీ అధ్యక్షులు సుంకేట రవి, జిల్లా మైనారిటీ నాయకులు రఫీ, జిల్లా కిసాన్ ఖేత్…

Read Full News

ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు.. ఆలయంలో ప్రత్యేక పూజలు

భీంగల్, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి) మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భీంగల్ పట్టణంలోని చొక్కయ్య గుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు, స్థానికులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఈరవత్రి అనిల్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండిన జీవితం గడపాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తి, అవకాశాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఆలయంలో…

Read Full News

మోపాల్‌లో దుర్గామాత ఉత్సవ సమితి నూతన షెడ్డు నిర్మాణానికి భూమిపూజ

మోపాల్, సెప్టెంబర్ 26:(E6tv NEWS: శివ ఠాకూర్). మోపాల్ గ్రామంలో శనివారం దుర్గామాత ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నూతన షెడ్డు నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దుర్గామాత ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు, గ్రామ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో నూతన షెడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భూమిపూజ చేశారు. దుర్గామాత ఉత్సవాలను ప్రతిఏటా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని, ఉత్సవాల సందర్భంగా గ్రామ ప్రజలు,…

Read Full News

మిర్జాపూర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి

నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 26:(E6tv NEWS: శివ ఠాకూర్). మిర్జాపూర్ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని 3వ వార్డు మెంబర్ సబ్బిడి మొగులవ్వ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సబ్బిడి రమేష్ మాట్లాడుతూ.. దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. పేదలు, మహిళల హక్కుల…

Read Full News

ప్రశాంత వాతావరణంలో గణపతి నిమజ్జన ర్యాలీ

భజన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్‌ఐ మోహన్‌రెడ్డి, పోలీసు సిబ్బంది మద్నూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి)కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గణపతి నిమజ్జన ర్యాలీని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. గణపతి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి భక్తులు ర్యాలీగా నిమజ్జనానికి తరలించారు. ర్యాలీలో మద్నూర్ పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా పాల్గొని భక్తులకు భద్రత కల్పించారు. ఎస్‌ఐ మోహన్‌రెడ్డితో పాటు కానిస్టేబుళ్లు భక్తులతో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసు…

Read Full News

గణేష్ నిమజ్జనంపై పోలీసుల పటిష్ట నిఘా

కమాండ్ కంట్రోల్ హాల్‌ నుంచి పర్యవేక్షించిన సీపీ సాయి చైతన్య 200 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ట్రాఫిక్, భద్రతపై ప్రత్యేక దృష్టి నిజామాబాద్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: శివ ఠాకూర్). గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా నిజామాబాద్ నగరంలో పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా కమాండ్ కంట్రోల్ హాల్‌ నుంచి నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ క్షుణ్ణంగా…

Read Full News