Breaking News

డ్రాఫ్ట్ లిస్ట్‌లో పేరున్నా డేంజర్ బెల్స్.. దాదాపు కోటి మందికి నోటీసులు ఇచ్చేందుకు ఈసీ సన్నాహాలు!

హైదరాబాద్: ముసాయిదా ఓటర్ల జాబితా (Draft Electoral Rolls) ప్రచురణకు మరో రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే, ఈ జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ దాదాపు కోటి మంది ఓటర్లకు నోటీసులు అందే అవకాశం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్రాఫ్ట్ రోల్స్‌లో పేరు ఉన్నంత మాత్రాన ఓటు భద్రంగా ఉన్నట్లు భావించవద్దని, పేర్లు తొలగించబడే అవకాశం కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధాన అంశాలు:

Read More

రేవంత్ రెడ్డి ఒక ‘క్రిమినల్ వేస్ట్’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ కడిగిపారేత!

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలోని నిరుద్యోగ యువతను, ఇంజనీరింగ్ విద్యార్థులను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాష్ట్ర యువతకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రెస్ మీట్‌లో కేటీఆర్ వ్యాఖ్యలు:

Read More

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.1 లక్ష ఎల్‌ఓసీ అందజేత

అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్నకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బాల్కొండ, ఆగస్టు 3: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సాట్లపల్లి రాజన్న (తండ్రి: గంగారం) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సిందిగా సూచించడంతో కుటుంబ సభ్యులు వైద్య సహాయం కోసం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ను సంప్రదించారు.విషయాన్ని…

Read More

బాల్కొండ నియోజకవర్గ ఆరోగ్య రంగ అభివృద్ధికి 10 కీలక ప్రతిపాదనలు

ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 3: E6 tv NEWS ప్రతినిధి. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన నిజామాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ ఆరోగ్య రంగ అభివృద్ధికి సంబంధించిన…

Read More

ఇందిరానగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మద్నూర్‌లో సామూహిక మరుగుదొడ్ల ప్రారంభోత్సవం మద్నూర్, ఆగస్టు 3: E6 tv NEWS(M. మస్నాజీ) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి మద్నూర్ గ్రామ సర్పంచ్  ఉషా సంతోష్ తీసుకెళ్లారు. సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీలో డ్రైనేజీ సమస్య కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న…

Read More

అనారోగ్యంతో బాధపడుతున్న వార్డు సభ్యుడు బాబును పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

నిజాంసాగర్, ఆగస్టు 3: E6 tv NEWS ప్రతినిధి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామపంచాయతీ పరిధికి చెందిన 10వ వార్డు సభ్యుడు బాబు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సోమవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు బంజపల్లి గ్రామ సర్పంచ్  ఏలే సుగుణమ్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వార్డు సభ్యుడు బాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి…

Read More

గ్రామపంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని హండె కేలూర్ గ్రామస్తుల వినతి

మద్నూర్, ఆగస్టు 3: E6 tv NEWS (M. మస్నాజీ) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హండె కేలూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామానికి కొత్త కార్యదర్శిని నియమించాలని గ్రామస్తులు మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)కు వినతిపత్రం సమర్పించారు.వినతిపత్రంలో గ్రామస్తులు పేర్కొన్న వివరాల ప్రకారం, బీసీ కాలనీలో గడ్డివార్ వీరేశంకు అక్రమ నిర్మాణం పేరుతో గ్రామపంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారని తెలిపారు. అయితే అదే ప్రాంతంలో తాము గత 20 ఏళ్లుగా…

Read More

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గోడ గడియారాల పంపిణీ

జుక్కల్, ఆగస్టు 3: E6 tv NEWS (M. మస్నాజీ). కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గోడ గడియారాలను సోమవారం పంపిణీ చేశారు.జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు ఈ గోడ గడియారాలను అందజేసినట్లు గ్రామ సర్పంచ్  వి. రమణా సురేష్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా…

Read More

నేరాల నియంత్రణ, నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు సత్వర న్యాయం అందించాలి: జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

కామారెడ్డి, ఆగస్టు 3: E6 tv NEWS (ప్రతినిధి). కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోలీసు అధికారులతో నెలవారీ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో నేరాల నివారణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, శాంతిభద్రతలు, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో వేగవంతమైన, నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు…

Read More

సైబరాబాద్ ప్రజావాణిలో 35 ఫిర్యాదులు: టౌన్ ప్లానింగ్‌పైనే అత్యధిక అర్జీలు!

హైదరాబాద్ (సైబరాబాద్): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. కార్పొరేషన్ కమిషనర్ జి. శ్రీజన, ఇతర అన్ని శాఖల అధికారులతో కలిసి నేరుగా ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వారి సమస్యలను ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు. బాధితుల నుంచి 35 ఫిర్యాదులు: సోమవారం నాటి ప్రజావాణిలో మొత్తం 35 వినతులు నమోదయ్యాయి. ఇందులో: ట్రాకింగ్ ఐడీలతో క్షేత్రస్థాయి విచారణ: ప్రజావాణికి వచ్చిన ప్రతి…

Read More