Telangana
బీజేపీ సర్పంచ్‌పై వివక్ష చూపుతున్నారని ఆరోపణలు
సంక్షేమ పథకాల సమాచారం ఇవ్వడం లేదని బీజేపీ నేతల ఆరోపణలు రుద్రూర్, సెప్టెంబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామంలో బీజేపీకి చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లపై అధికార యంత్రాంగం, అధికార పార్టీ నాయకులు వివక్ష చూపుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. రుద్రూర్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు ఈ ఆరోపణలు చేశారు. అంబం (ఆర్) గ్రామానికి 25 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ, ఈ విషయంపై సర్పంచ్,…
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి
– షేక్ మతిన్ రుద్రూర్, సెప్టెంబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ నాయకుడు షేక్ మతిన్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని షేక్ మతిన్ పేర్కొన్నారు….
బడా భీంగల్‌లో కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్‌కు భూమిపూజ
స్వచ్ఛ భారత్ మిషన్ గ్రాంట్‌తో రూ.3 లక్షల నిధులు బడా భీంగల్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతనిధి) బడా భీంగల్ గ్రామంలోని ఎల్లమ్మ గుడి ఆవరణలో కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రాంట్ ద్వారా మంజూరైన రూ.3 లక్షల నిధులతో చేపట్టనున్న నిర్మాణ పనులకు ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్…
బాబాపూర్‌లో వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్‌పై అవగాహన సమావేశం
గ్రామ అభివృద్ధి పనుల గుర్తింపుపై మహిళలు, రైతులు, ప్రజలకు అవగాహన భీంగల్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిది) భీంగల్ మండలం బాబాపూర్ గ్రామంలో వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్ (VGPP) తయారీ కోసం మహిళలు, రైతులు, గ్రామస్తులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్‌ల ద్వారా గ్రామంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులను గుర్తించే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ…..
భీంగల్ 10వ వార్డులో కొత్త రేషన్ కార్డుల పంపిణీ
భీంగల్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి )భీంగల్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బదిరే నాగమణి స్వామి, వైస్ చైర్మన్ జేజే లత, జేజే నర్సయ్య, కౌన్సిలర్ నాగేంద్రబాబు, అనంతరావు, తోట సతీష్, సంధ్య నాయక్, 10వ వార్డు అధ్యక్షుడు పత్రి రాజు, వార్డు ఆఫీసర్…
బాసర పాదయాత్రికులకు బచ్చు గోపాల్ సెట్ కుటుంబం అల్పాహారం
రుద్రూర్లో సుమారు 60 మంది పాదయాత్రికులకు ఆతిథ్యం రుద్రూర్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల బచ్చు గోపాల్ సెట్ రైస్ మిల్లులో బాసర పాదయాత్రికులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. బండ రెంజల్ గ్రామంలోని రానాందేవ్ మందిరం నుంచి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం గంగారం మహారాజ్ ఆధ్వర్యంలో సుమారు 60 మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. పాదయాత్రికులు రుద్రూర్ చేరుకోవడంతో బచ్చు…
కుబీర్‌లో కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ బీజేపీ నాయకుడు
మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న రవి కుబీర్, సెప్టెంబర్ 29: (E6tv NEWS: ప్రతినిధి) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కుబీర్ మండలానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు రవి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం పాల్సి గ్రామానికి చెందిన సీనియర్ బీజేపీ మండల నాయకుడు రవి, మాజీ ఎమ్మెల్యే జి. విట్టల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు….
భైంసాలో రేపటి ‘ప్రజావాణి’ కార్యక్రమం రద్దు
అనివార్య కారణాలతో సెప్టెంబర్ 30న జరగాల్సిన కార్యక్రమం వాయిదా భైంసా, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 30న భైంసా క్యాంప్ కార్యాలయంలో జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు నిర్మల్ జిల్లా పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల (IPS) పర్యవేక్షణలో ప్రతి బుధవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను పోలీసుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే అనివార్య పరిస్థితుల కారణంగా…
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు
ఎర్గట్లలో ఉత్సాహంగా నిర్వహణ.. విజేతలకు జిల్లా స్థాయి పోటీలకు అవకాశం ఎర్గట్ల, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఎర్రగట్ల మండల కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం మండల స్థాయి క్రీడా పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా డ్రాయింగ్ పోటీ, 100 మీటర్ల పరుగు పందెం, స్పూన్ అండ్ మార్బుల్,…
ఐదుగురు వార్డు సభ్యులపై సర్పంచ్ వివక్ష చూపుతున్నారు
ఒక సంవత్సరం నుంచి పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపణలు రుద్రూరు, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ఐదుగురు వార్డు సభ్యులపై సర్పంచ్ ఇందూరి సునీత చంద్రశేఖర్ వివక్ష చూపుతున్నారని వార్డు సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట వారు విలేకరుల సమావేశం నిర్వహించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా తమ తమ వార్డుల్లో ప్రజలు…
