Breaking News

కేంద్రీయ విద్యాలయంలో మంత్రి పొన్నం

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం తంగళ్లపల్లి మండలంలోని కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో మంజూరు చేయించిన ఈ పాఠశాలలో తరగతి గదులను పరిశీలించిన ఆయన, విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి స్వీట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే విద్యార్థులలోని దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాటలు పాడగా, మంత్రి వారితో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *