Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటో నుజ్జునుజ్జు.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

భైంసా, అక్టోబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భైంసా పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఆటో డ్రైవర్ షేక్ సుహేల్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం.. షేక్ సుహేల్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆటోకు డీజిల్ పోయించేందుకు ఆర్డీవో చెక్‌పోస్ట్ సమీపంలోని…

Read Full News

నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం నియామకం

నిజామాబాద్, అక్టోబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి)నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ తెలిపారు. మున్నూరు కాపు సంఘం సమావేశంలో సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సామాజిక సేవా కార్యక్రమాలపై చర్చించి పలువురిని వివిధ బాధ్యతల్లో నియమించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా సుగంధం మురళి, సుగంధం సతీష్, ఆది రేఖుల సాయిలు, సోమినేని రాజేందర్, ఇంతు సత్యజీత్, ఇంతు ప్రవీణ్ కుమార్, ముహూర్…

Read Full News

నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేస్తున్నాయి

ప్రతి బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం మూడు ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, అక్టోబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) నేరెళ్ల బాధితులకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు న్యాయం చేయడంలో విఫలమయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నేరెళ్ల బాధితుల అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్న నాయకులు, ఇప్పుడు వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. 2017లో నేరెళ్లలో జరిగిన ఘటన తెలంగాణ సమాజం తలదించుకునే ఘటన అని కవిత…

Read Full News

జీపీ రోడ్డు కబ్జాపై గ్రామస్తుల ఆగ్రహం

500 మంది సంతకాలు కావాలంటున్న గ్రామ కార్యదర్శి తీరుపై మండిపాటు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంలో ఇంత నిర్లక్ష్యమా? అక్బర్‌నగర్ గ్రామస్తుల ఆవేదన అక్బర్‌నగర్, అక్టోబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) గ్రామంలో అనేక సంవత్సరాలుగా ఉన్న గ్రామపంచాయతీ (జీపీ) రోడ్డును పరిరక్షించి, పంచాయతీ ఆధీనంలోకి తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. జీపీ రోడ్డుకు సంబంధించిన భూమి ప్రభుత్వ/గ్రామపంచాయతీకి చెందినదని, దీనిపై గతంలో గ్రామపంచాయతీ సమావేశాల్లో పలుమార్లు తీర్మానాలు కూడా చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.ఈ విషయంపై గ్రామస్తులు ఇప్పటికే…

Read Full News

వర్ని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

వర్ని, అక్టోబర్ 3: (E6tv NEWS: ప్రతినిధి) వర్ని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్టుల ఐక్యత, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రెస్ క్లబ్ పనిచేయాలని సభ్యులు నిర్ణయించారు. నూతన కార్యవర్గం గౌరవ అధ్యక్షులు: కిషన్ రాథోడ్ – సీనియర్ రిపోర్టర్, మెట్రో పేపర్ అధ్యక్షులు: సోన్ కాంబ్లే చందర్ – మన తెలుగు, న్యూస్ నెట్‌వర్క్ రిపోర్టర్ ఉపాధ్యక్షులు: బేగరీ బాబు – జన సంఘర్షణ…

Read Full News

దళిత జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా డీజేఎఫ్

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం బోధన్ డివిజన్ దళిత జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంధం రాజేష్ బోధన్, అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి).దళిత, బహుజన జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దళిత జర్నలిస్ట్ ఫోరం (డీజేఎఫ్) పనిచేస్తోందని బోధన్ డివిజన్ డీజేఎఫ్ గౌరవ అధ్యక్షులు అశోక్ కుంబ్లే తెలిపారు. బోధన్ పట్టణంలోని స్థానిక లయన్స్ క్లబ్ కార్యాలయంలో శనివారం డీజేఎఫ్ బోధన్ డివిజన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. డీజేఎఫ్ బోధన్ డివిజన్…

Read Full News

టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ నిర్మల్ నియోజకవర్గ చైర్మన్ కత్తి నరేందర్‌కు ఘన సన్మానం

నిర్మల్, అక్టోబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి). నిర్మల్ జిల్లాలో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ నిర్మల్ నియోజకవర్గ చైర్మన్, కాంగ్రెస్ కౌన్సిలర్ కత్తి నరేందర్‌ను మాదిగ ఎంప్లాయీస్ నిర్మల్ జిల్లా ప్రతినిధులు, కాలనీ మైనార్టీ మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కత్తి నరేందర్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కత్తి సురేష్, ఉప్పిరి రవి, చందుల చందు, సుభాన్‌తో పాటు స్థానిక ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు…

Read Full News

బీడీ కార్మికులపై అదనపు వసూళ్లు ఆపాలి

దేశాయి బ్రదర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నిజామాబాద్,అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి)బీడీ కార్మికుల నుంచి వేయి బీడీలకు రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశాయి బ్రదర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, రాజకీయ బీడీ వర్కర్స్ యూనియన్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజకీయ బీడీ వర్కర్స్ యూనియన్…

Read Full News

నైపుణ్యంతోనే మహిళా సాధికారత

యువతులు స్వయం ఉపాధి సాధించి కుటుంబాలకు అండగా నిలవాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసా, అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి).యువతులు ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం సాధించి స్వయం ఉపాధి పొందుతూ తమ సొంత కాళ్లపై నిలబడాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా పట్టణంలోని శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న యువతులకు నిర్వహించిన సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు….

Read Full News

మౌంట్ తరంగ్–II అధిరోహించిన విశాలావత్ బన్నీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సన్మానం

హైదరాబాద్, అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి) హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్–స్పితి జిల్లాలో ఉన్న మియార్ లోయలో 6,027 మీటర్ల ఎత్తైన సాంకేతిక శిఖరం మౌంట్ తరంగ్–IIను విజయవంతంగా అధిరోహించిన తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి విశాలావత్ బన్నీని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘనంగా సన్మానించారు. ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో పది మంది సభ్యులతో కూడిన భారతీయ పర్వతారోహణ బృందం మియార్ లోయలో సవాలుతో కూడిన ఈ శిఖరారోహణను విజయవంతంగా…

Read Full News