E6TV Special Storys
it is exclusive Content for E6TV
కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడకుండా బీఆర్ఎస్‌పై ప్రతీకారం: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం!
హైదరాబాద్: నీట్ (NEET-UG) పేపర్ లీకేజీ అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వదిలేసి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (K.T. రామారావు) తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి ద్వంద్వ విధానాలు పాటిస్తూ విద్యార్థుల ఆందోళనలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. న్యూఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా బీఆర్ఎస్‌వీ (BRSV) చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్ వ్యాఖ్యల్లోని ప్రధానాంశాలు:
సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి జులై 24: E6 tv NEWS ప్రతినిధి. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. కేటీఆర్ దీర్ఘాయుష్షుతో ప్రజలకు…
విద్యార్థులపై దాడి అమానుషం
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముధోల్‌లో మహాధర్నా ముధోల్, జూలై 24: E6 tv NEWS తిరుపతి గౌడ్. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. ఏఐసీసీ మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు…
నీట్ నిరసనలు.. విద్యార్థుల పోరాటమా? రాజకీయాల వేదికా?
జంతర్ మంతర్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ.. అసలు బాధ్యత ఎవరిది? విద్యార్థుల భవిష్యత్తు ఎటు? E6 ప్రత్యేక ప్రతినిధి: శివ ఠాకూర్. దేశంలో వైద్య విద్యకు ప్రవేశ ద్వారంగా భావించే నీట్ (NEET) పరీక్ష మరోసారి రాజకీయ, సామాజిక, విద్యా రంగాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన, ఆ తర్వాత జరిగిన పోలీసు చర్యలు, రాజకీయ నాయకుల ప్రవేశం, విద్యార్థులపై నమోదయ్యే అవకాశమున్న కేసులు—ఇవన్నీ కలిసి ఒక…
దశల వారిగా గ్రామాల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
దేగాం, బిజ్జూర్, లింగా గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభం మహిళా సమైక్య భవనాలు, పాఠశాల ప్రహరీ గోడ, జలసిరి కార్యక్రమానికి శ్రీకారం ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు – విద్యార్థులతో మమేకమైన ఎమ్మెల్యే బైంసా, జూలై 23: E6 tv NEWS తిరుపతి గౌడ్. దశలవారీగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బైంసా మండలంలోని దేగాం గ్రామంలో రూ.7 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడను,…
రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం: పోతన్న యాదవ్
ముధోల్, జూలై 23: E6 tv NEWS (తిరుపతి గౌడ్) నీట్ పరీక్ష అంశంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని, విద్యార్థుల తరఫున గొంతెత్తిన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం…
దేశభక్తి కార్మిక సంక్షేమమే బీఎంఎస్ ధ్యేయం: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
బీఎంఎస్ ఆవిర్భావ దినోత్సవంలో జెండా ఆవిష్కరణ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే ఇందూరు, జూలై 23:E6 tv NEWS శివ ఠాకూర్ దేశభక్తి, కార్మిక సంక్షేమం, సామాజిక బాధ్యతలను కేంద్రబిందువుగా చేసుకుని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) దేశవ్యాప్తంగా సేవలందిస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. బీఎంఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నగరంలోని నిజామాబాద్-2 ఆర్టీసీ డిపోలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లోకమాన్య తిలక్ జయంతినాడే…
చాగంటి రాకతో రూరల్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక వాతావరణం
ప్రవచన చక్రవర్తికి ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి హృదయపూర్వక స్వాగతం నిజామాబాద్, జూలై 23: E6 tv NEWS (శివ ఠాకూర్). ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఈ నెల 24న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి విచ్చేయనున్న సందర్భంగా ఆయనకు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో బోర్గాం(పి)లోని భూమారెడ్డి కన్వెన్షన్‌లో నిర్వహించనున్న “గోమాత వైభవం” కార్యక్రమానికి ముఖ్య…
కేంద్ర నిధులతో రోడ్డు భద్రతకు పెద్దపీట
నిజామాబాద్, జగిత్యాల బ్లాక్ స్పాట్ల నివారణకు రూ.1,023 కోట్ల కేటాయింపు లోక్‌సభలో ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం నిజామాబాద్, జూలై 23 (E6 tv NEWS): తెలంగాణలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. లోక్‌సభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్…
యాపిల్స్‌కే కాదు.. బ్లూబెర్రీస్‌కూ కేరాఫ్ అడ్రస్ కానున్న కాశ్మీర్!
శ్రీనగర్ : తరతరాలుగా యాపిల్ పంటకు ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయలో ఇప్పుడు ఒక కొత్త హార్టికల్చర్ విప్లవానికి నాంది పడుతోంది. షేర్-ఎ-కాశ్మీర్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (SKUAST) నిర్వహించిన పరిశోధనల్లో బ్లూబెర్రీస్ (Blueberries) సాగు విజయవంతమైంది. అక్కడ పండిన బ్లూబెర్రీస్ రుచి, పరిమాణం ఊహించిన దానికంటే అద్భుతంగా ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యాపిల్స్ పండని నేలల్లో బ్లూబెర్రీస్! యాపిల్ తోటలకు భిన్నంగా బ్లూబెర్రీ సాగు సాగుతుందని ప్రొఫెసర్ అషఫాక్ పండిట్ తెలిపారు:…

