Breaking News

ఢిల్లీలో పోలవరం నిధులపై చర్చ..జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో సమావేశమయ్యారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే లక్ష్యంతో పనులు వేగవంతం చేస్తున్నామని వివరిస్తూ, పోలవరం ప్రాజెక్టుతో పాటు జల్ జీవన్ మిషన్ పనులకు సకాలంలో నిధులు విడుదల చేయాలని కోరారు. భేటీలోని ప్రధానాంశాలు:

Read Full News

అద్వానీతో ప్రధాని మోదీ భేటీ!

ప్రభుత్వ అధినేతగా (గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం భారత ప్రధానమంత్రిగా) విజయవంతంగా 25 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్‌కే అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ప్రధాన ముఖ్యాంశాలు:

Read Full News

ఎయిర్ ఫోర్స్ డే: గవర్నర్, కిషన్ రెడ్డి గ్రీటింగ్స్

భారతీయ వాయుసేన (IAF) 94వ దినోత్సవం (అక్టోబర్ 8) సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మరియు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వైమానిక రక్షణ యోధులకు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖుల సందేశాలు:

Read Full News

రాహుల్, ప్రియాంక గాంధీలపై ఎఫ్‌ఐఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్న ఓటర్ల జాబితా ప్రత్యేక తుది సవరణ (SIR) వ్యతిరేక నిరసన ప్రదర్శనల సమయంలో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా మరియు ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనల్లో పోలీసుల విధులకి ఆటంకం కలిగించడమే కాకుండా, వారిపై దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలపై…

Read Full News

విజయ్ ఆస్తుల వివాదంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన ఆస్తుల వివరాలపై నేడు మద్రాస్ హైకోర్టులో విచారణ జరగనుంది. అఫిడవిట్‌లో విజయ్ సుమారు రూ.600 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించినప్పటికీ, మరో రూ.30 కోట్ల విలువైన ఆస్తుల (బంగ్లా మొదలైనవి) వివరాలను దాచిపెట్టారని ఒక పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. విజయ్ తన ఆస్తుల సమాచారాన్ని సరిగా వెల్లడించనందున ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. అయితే, కేవలం ఈ ఆరోపణల ఆధారంగా ఆయనను…

Read Full News

‘ఎస్‌ఐఆర్‌ గో బ్యాక్’: రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు

ఓటర్ల జాబితా ప్రత్యేక తుది సవరణ (SIR) కార్యక్రమానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి, బారాఖంబా పోలీస్ స్టేషన్‌లో రాహుల్ గాంధీని కలసి తనకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో పాటు కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ కూడా ఉన్నారు. పోలీస్ స్టేషన్…

Read Full News

దసరా, బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

జగిత్యాల, అక్టోబర్ 07 (E6tvNEWS: ప్రతినిధి)దసరా నవరాత్రోత్సవాలు, సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని నంబి వేణుగోపాల చార్య కౌశిక కోరారు. ఈ మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్యప్రణవ్‌ను కలిసి అవసరమైన ఏర్పాట్లపై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 11న శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమై, అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 20న దసరా పండుగ నిర్వహించనున్నట్లు…

Read Full News

కస్టమర్లకు మల్లి షాక్ ఇచ్చిన ఎయిర్‌టెల్.

ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను 3 నుంచి 10 శాతం వరకు పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. పెంచిన ఈ కొత్త ప్లాన్ల ధరలు గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. సవరించిన ప్లాన్ల ప్రకారం ఇకపై నెలకు రూ. 499 నుంచి రూ. 1,799 వరకు వేర్వేరు ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ధరల పెంపుతో పాటు వినియోగదారులకు ఏడాదికి ఒకసారి ఉచిత అంతర్జాతీయ రోమింగ్ (International Roaming) ప్యాక్‌ను ఈ కొత్త…

Read Full News

సీఈసీ రాజీనామాకు రాహుల్ గాంధీ నిరసన

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, భారత ముఖ్య ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు దాదాపు 237 మంది విపక్ష ఎంపీలు ఢిల్లీలో చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు రహదారులను దిగ్బంధించి, ఆందోళనకారులను అడ్డుకోవడంతో పాటు రాహుల్ గాంధీ సహా పలువురు నేతలను బలవంతంగా…

Read Full News

యుపిఐ ఛార్జీలపై ఆర్‌బీఐ గవర్నర్ క్లారిటీ

అక్టోబర్ 15 నుంచి రూ.2,000 దాటిన ఎంపిక చేసిన వ్యాపార యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలు చేయనున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం లావాదేవీల పరిమాణంపై పెద్దగా ప్రభావం చూపదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. బుధవారం నాటి ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం లావాదేవీల్లో ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదని, స్వల్పంగా…

Read Full News