Breaking News

అభివృద్ధి, సంక్షేమమే మా అజెండా: మంత్రి సవితమ్మ

కక్ష సాధింపు రాజకీయాలు మా విధానం కాదుసూపర్ సిక్స్ హామీల్లో 90 శాతం అమలు చేశాంపెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు పెనుకొండ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి)  నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖల మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే సవితమ్మ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని పనులు చేపడతామని చెప్పారు. పెనుకొండ…

Read Full News

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు శుభాకాంక్షలు

భీంగల్, సెప్టెంబర్ 16: (E6tv NEWS: ప్రతినిధి). టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భీంగల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్…

Read Full News

అవసరమైతే ఇవాళే రాజీనామా చేస్తా:అసెంబ్లీలో ఎమ్మెల్యే రాకేశ్‌ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వేదికగా బీజేపీ ఎమ్మెల్యే ఆర్మ్‌ర్ రాకేశ్‌ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పట్ల ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని, కేవలం కొడంగల్, పరిగి వంటి కొన్ని కొన్ని ప్రాంతాలకే భారీగా నిధులు కేటాయిస్తూ తమ జిల్లాను విస్మరిస్తున్నారని సభలో మండిపడ్డారు. ఆర్మూరులో నిజాం కాలంలో నిర్మించిన ఎంఆర్‌వో, సబ్ కలెక్టర్ కార్యాలయ భవనాలు కూలిపోయే స్థితికి చేరాయని, క్లర్క్ స్థాయి అధికారి కూర్చోవడానికి…

Read Full News

తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సింగపూర్ సన్నాహాలు

శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ ప్రతినిధులు వెల్లడించారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల పురోగతిని ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. తొలిదశలో మూసా, ఈసా నదుల సంగమం నుంచి గాంధీ సరోవర్…

Read Full News

గణనాథుడికి కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు!

హైదరాబాద్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎర్రవెల్లి నివాసంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ ధార్మిక క్రతువులో కేసీఆర్, ఆయన సతీమణి శోభలతో పాటు కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా పాల్గొని తాత, నానమ్మలతో కలిసి ఏకదంతుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూ వారు మట్టి వినాయకుడికే పూజలు నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్…

Read Full News

పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్ నందన..

విదేశీ ఉద్యోగాల పేరిట కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ నందన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల నోటీసుల ప్రకారం సెప్టెంబర్ 16 వరకు సమయం ఉన్నప్పటికీ, ఒకరోజు ముందే ఆమె న్యాయవాదులతో కలిసి మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సుమారు 3 గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు ఆమెపై 20కి పైగా ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే కన్సల్టెన్సీ వ్యవహారాలు,…

Read Full News

చివరి రోజు సభ ముందుకు రానున్న అత్యంత కీలక బిల్లులు…

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. మూడు రోజుల విరామం అనంతరం మొదలైన ఈ సెషన్ చివరి రోజైన నేడు, సభ ముందుకు అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలక బిల్లులు రానున్నాయి. సభను మరో రోజు పొడిగించడంతో నేటి అజెండా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. శాసనసభలో ఉదయం ప్రారంభమైన ప్రశ్నోత్తరాల కార్యక్రమం తీవ్ర ఉత్కంఠగా సాగుతోంది. నేడు సభలో ప్రధానంగా నిషేధిత భూముల జాబితా (Section 22A) వివాదం మరియు ఎల్‌నినో ప్రభావాలపై…

Read Full News

ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం బంద్: షాక్‌లో గణేష్ ఉత్సవ కమిటీలు!

హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ప్రసిద్ధ ట్యాంక్ బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు సూచనల మేరకు సిటీ పోలీస్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ల పేరిట ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా వెలిసిన హెచ్చరిక ఫ్లెక్సీలు ప్రస్తుతం నగరంలో తీవ్ర హాట్ టాపిక్‌గా మారాయి. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని, కోర్టు నిబంధనలకు లోబడి ఉత్సవ…

Read Full News

సమ్మెకు సిద్ధమైన పవర్ జేఏసీ

పాల్వంచ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి) విద్యుత్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై యాజమాన్యంతో చర్చలు జరిగి 15 రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంపై పవర్ జేఏసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యుత్ యాజమాన్యాల నుంచి సరైన స్పందన లేకపోవడంతో సమ్మెకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు పవర్ జేఏసీ వెల్లడించింది. సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లోని 1104 కార్యాలయంలో జరిగిన విద్యుత్ జేఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో పవర్ ఎంప్లాయీస్…

Read Full News

చక్రం గుడిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి మాస కల్యాణం ఘనంగా నిర్వహణ

నిజామాబాద్, సెప్టెంబర్ 15:(E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంలోని చక్రం గుడిలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి మాస కల్యాణ మహోత్సవాన్ని మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సుందరంగా అలంకరించి మాస కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపారు. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమైన కల్యాణ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. వేద మంత్రోచ్ఛారణలు,…

Read Full News