Breaking News

‘రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడు’.. కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి “నిజాయితీ గల మోసగాడు” అని, ఎన్నికల ముందు చెప్పినట్లే పాలనలో మళ్లీ పాత కష్టాల రోజులను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో మహబూబాబాద్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. “గత ఎన్నికల్లో ప్రజలు పాలిచ్చే బర్రెను కాదని, తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు” అని వ్యాఖ్యానించిన…

Read Full News

‘నా పని ఇంకా పూర్తి కాలేదు’..:2027 ప్రపంచ కప్ లక్ష్యాలపై రోహిత్ శర్మ స్పష్టత

తన వన్డే భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తెరదించారు. వన్డే క్రికెట్‌లో సాధించాల్సింది ఇంకా మిగిలే ఉందని, 2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌పై తాను దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. వెస్టిండీస్‌తో త్వరలో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందు ‘జియో స్టార్’ (JioStar) ఛానెల్‌తో రోహిత్ శర్మ మాట్లాడారు. టెస్టులు, టీ20 ఫార్మాట్ల నుంచి తప్పుకున్న తర్వాత వన్డేల్లో కొనసాగడంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “నా లక్ష్యం పూర్తయిపోయిందనే…

Read Full News

‘రణబాలి’ :విజయ్ – రష్మిక కాంబోపై భారీ హైప్!

వరుస పరాజయాలను పక్కనపెట్టి కొత్త ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరించే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కానుంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ మరోసారి తెరపై సందడి చేయనుంది. పెళ్లి తర్వాత…

Read Full News

సీఈసీ రాజీనామాకు డిమాండ్: సెప్టెంబర్ 28న తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు పిలుపు!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిష్పాక్షికత లోపించిందని, ఈసీ తీరుపై ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 28న (సోమవారం) తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని…

Read Full News

యువతను ఆకట్టుకుంటున్న ‘భజన్ క్లబ్బింగ్‌’లో ప్రధాని మోదీ

ఆధ్యాత్మికతకు ఆధునిక సంగీతాన్ని జోడించి భక్తి సమ్మేళనాన్ని సరికొత్తగా అందించే వినూత్న ప్రక్రియే ‘భజన్ క్లబ్బింగ్‌’ (Bhajan Clubbing). సంప్రదాయ భజనల పవిత్రతను కాపాడుతూనే, వాటికి మోడ్రన్ మ్యూజిక్, బీట్స్, కచేరీ తరహా లైవ్ వాతావరణాన్ని జోడించడమే దీని ప్రత్యేకత. ఇక్కడ ప్రేక్షకులు కేవలం వినడమే కాకుండా చప్పట్లు కొడుతూ, నృత్యం చేస్తూ ఉత్సాహంగా భాగస్వాములవుతారు. ఈ కొత్త ట్రెండ్ ప్రస్తుతం Gen-Z యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని…

Read Full News

మోడల్ కాలనీలో రూ.22 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ

హిందూపురం, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని మోడల్ కాలనీలో రూ.22 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. మాజీ కౌన్సిలర్, బీజేపీ హిందూపురం పట్టణ అధ్యక్షురాలు అంజలి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతినిధి సురేంద్ర, వ్యక్తిగత కార్యదర్శి బాలాజీ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మాజీ చైర్మన్ డీఈ రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు రమేష్ రెడ్డి,…

Read Full News

ఇరవైత్రి అనిల్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా

కమ్మర్‌పల్లి, సెప్టెంబర్ 26: (E6tv NEWS: ప్రతినిధి). రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఇరవైత్రి అనిల్ కుమార్ జన్మదిన వేడుకలను కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనిల్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ పాలేపు నర్సన్న, వీసీ బుచ్చన్న, మాజీ అధ్యక్షులు సుంకేట రవి, జిల్లా మైనారిటీ నాయకులు రఫీ, జిల్లా కిసాన్ ఖేత్…

Read Full News

ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్:కానీ ఎందుకు?

దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానంతో పాటు పలు ఉద్యోగ సంబంధిత డిమాండ్ల సాధనకై యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు సెప్టెంబర్ 28 నుండి 30 వరకు (మూడు రోజుల పాటు) బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. ఈ సమ్మె కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (RRBs) ప్రత్యక్ష బ్రాంచ్ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. రేపు…

Read Full News

సీఈసీ రాజీనామా చేయాల్సిందే..ఢిల్లీలో విపక్షాలు, విద్యార్థి సంఘాల నిరసన

కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిష్పాక్షికతపై ప్రశ్నలు గుప్పిస్తూ, సీఈసీ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని మరియు ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) వంటి విద్యార్థి సంఘాలతో పాటు ఢిల్లీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ మరియు ‘నిర్వాచన్ సదన్’ (ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం) వద్ద భారీ ధర్నాలు చేపట్టారు….

Read Full News

ఖైరతాబాద్ బైపోల్ లో కవిత ఎంట్రీ..

ఖైరతాబాద్ ఉపఎన్నిక వేళ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో తమ ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. శనివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఫామ్‌హౌస్ డ్రామాలు ఆడుతున్నారని, కేవలం మాటల ప్రభుత్వంగా మారి చేతల్లో శూన్యమని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీవ్ర నిర్లక్ష్యం: సమాచార…

Read Full News