Breaking News

దసరా, బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

జగిత్యాల, అక్టోబర్ 07 (E6tvNEWS: ప్రతినిధి)దసరా నవరాత్రోత్సవాలు, సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని నంబి వేణుగోపాల చార్య కౌశిక కోరారు. ఈ మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్యప్రణవ్‌ను కలిసి అవసరమైన ఏర్పాట్లపై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 11న శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమై, అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 20న దసరా పండుగ నిర్వహించనున్నట్లు…

Read Full News

కస్టమర్లకు మల్లి షాక్ ఇచ్చిన ఎయిర్‌టెల్.

ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను 3 నుంచి 10 శాతం వరకు పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. పెంచిన ఈ కొత్త ప్లాన్ల ధరలు గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. సవరించిన ప్లాన్ల ప్రకారం ఇకపై నెలకు రూ. 499 నుంచి రూ. 1,799 వరకు వేర్వేరు ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ధరల పెంపుతో పాటు వినియోగదారులకు ఏడాదికి ఒకసారి ఉచిత అంతర్జాతీయ రోమింగ్ (International Roaming) ప్యాక్‌ను ఈ కొత్త…

Read Full News

సీఈసీ రాజీనామాకు రాహుల్ గాంధీ నిరసన

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, భారత ముఖ్య ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు దాదాపు 237 మంది విపక్ష ఎంపీలు ఢిల్లీలో చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు రహదారులను దిగ్బంధించి, ఆందోళనకారులను అడ్డుకోవడంతో పాటు రాహుల్ గాంధీ సహా పలువురు నేతలను బలవంతంగా…

Read Full News

యుపిఐ ఛార్జీలపై ఆర్‌బీఐ గవర్నర్ క్లారిటీ

అక్టోబర్ 15 నుంచి రూ.2,000 దాటిన ఎంపిక చేసిన వ్యాపార యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలు చేయనున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం లావాదేవీల పరిమాణంపై పెద్దగా ప్రభావం చూపదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. బుధవారం నాటి ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం లావాదేవీల్లో ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదని, స్వల్పంగా…

Read Full News

మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.1,108 కోట్లు మంజూరు

తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద ఉన్న శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయ అభివృద్ధికి మరియు 6 వరసల రహదారి నిర్మాణానికి రూ. 1,108.27 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు (GO Rt No. 928) జారీ చేసింది. దీనిలో రూ. 948.65 కోట్లను రాజగోపురాలు, యాగశాల, పుష్కరిణితో కూడిన భారీ ఆలయ సముదాయ నిర్మాణానికి, మిగిలిన రూ. 159.62 కోట్లను ఇస్తానా విల్లాస్…

Read Full News

బీజేపీలో కీలక పదవి వార్తలపై స్పందించిన బండి సంజయ్

తెలంగాణ బీజేపీలో త్వరలో కీలక పదవి అప్పగిస్తారంటూ సాగుతున్న ప్రచారంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ.. తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శిరసావహిస్తానని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని కరీంనగర్‌లో నిర్వహించిన ‘సేవా జ్యోతి’ ర్యాలీలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ భూ వివాదాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్నది నాటకమేనని, ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు…

Read Full News

పుష్పక్ బస్సు ఛార్జీలు 40% తగ్గింపు

దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులకు టీజీఎస్‌ఆర్టీసీ బిగ్ ఆఫర్ ప్రకటించింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడిచే ఏసీ ‘పుష్పక్’ బస్సుల్లో ప్రయాణ ఛార్జీలను ఏకంగా 40 శాతం వరకు తగ్గిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ అంచూరి శ్రీధర్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో వివిధ రూట్లలో రూ. 150 వరకు టికెట్ ధరలు తగ్గి బుధవారం నుంచే అమలులోకి రాగా, శిల్పారామం, గచ్చిబౌలి, కొత్తగూడల నుంచి గతంలో ఉన్న రూ.350 ఛార్జీ స్థానంలో రూ.150కి,…

Read Full News

సీఎం విజయ్‌కు షర్మిల దంపతుల పెళ్లి ఆహ్వానం

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తమ కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డి పరిణయ వేడుకకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ పెళ్లి వేడుకకు పలువురు ప్రముఖులను ఆహ్వానించే క్రమంలో వైఎస్ షర్మిల తన భర్త బ్రదర్ అనిల్ కుమార్‌తో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్‌ను ప్రత్యేకంగా కలిసి శుభలేఖను అందజేశారు. కుటుంబ సమేతంగా వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు….

Read Full News

రాజకీయాల్లోకి నటుడు ధనుష్?

తమిళ సినీ రంగంలో అగ్ర నటుడిగా గుర్తింపు పొందిన ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ‘తమిళగ ఎళుచ్చి కళగం’ (తమిళనాడు పురోగమన పార్టీ) పేరుతో ఆయన కొత్త పార్టీని స్థాపించనున్నారని, ఈ మేరకు భారత ఎన్నికల సంఘం వద్ద పేరును కూడా నమోదు చేయించినట్లు తమిళ మీడియా కథనాలు వెలువరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘనవిజయం సాధించి సీఎం పీఠాన్ని దక్కించుకున్న నేపథ్యంలో, ధనుష్ కూడా…

Read Full News

ఎర్రవల్లి 45 ఎకరాల లెక్క తేల్చాలని రేవంత్ ఆదేశం

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ (MCRHRD)లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎర్రవల్లి సర్వే నంబర్ 325 పరిధిలో రికార్డుల ప్రకారం 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాల్సి ఉండగా, ఇటీవల నిర్వహించిన ప్రాథమిక సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించామని, మిగిలిన 45 ఎకరాల వ్యత్యాసం ఉందో అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ వ్యత్యాసం ఉన్న భూమి మాజీ…

Read Full News