Breaking News

సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం విజయవాడ నుంచి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి పయనం కానున్నారు. ఈ హస్తిన పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌లతో భేటీ కానున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు రెండో దశ భూసేకరణ, పునరావాస ప్యాకేజీ కోసం రూ.33,000 కోట్ల నిధుల మంజూరుతో పాటు, స్పిల్‌వేపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.2,300 కోట్లు, పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన పథకానికి అవసరమైన అనుమతులపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి కీలక చర్చలు జరపనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *