News
వివేకా హత్య కేసులో లబ్ధిదారుడు జగనే: మంత్రి అనగాని
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అంతిమ లబ్ధిదారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈడీ, సీబీఐ విచారణలు ముమ్మరం కావడంతో భయపడి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ ధర్నాల పేరిట డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. సొంత బాబాయ్ గొడ్డలిపోటుకు గురైతే గుండెపోటుగా చిత్రీకరించే యత్నం చేశారని, రూ.40 కోట్ల సుపారీ…
రంగంలోకి ఈడీ: వివేకా కేసులో ఆర్థిక లావాదేవీలపై ఆరా
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ తీవ్ర ముమ్మరమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి (A-1) తో పాటు ఉమాశంకర్ రెడ్డి (A-3) ని ఈడీ అధికారులు హైదరాబాద్ కార్యాలయంలో రెండో రోజు కూడా సుదీర్ఘంగా ప్రశ్నించారు. హత్య వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణంలో ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ కేసులో రూ.40 కోట్ల భారీ సుపారీ ఒప్పందం జరిగిందన్న సీబీఐ…
‘మిషన్ కర్మయోగి’ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడలో ‘మిషన్ కర్మయోగి’ దక్షిణ ప్రాంతీయ రెండు రోజుల వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో పరిపాలనా నైపుణ్యాలు పెంపొందించడం, సామర్థ్య పెంపుదల (Capacity Building) లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల్లో అమలువుతున్న ఉత్తమ పాలనా విధానాలను, సంక్షేమ కార్యక్రమాలను…
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్
రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో పోలీసులు సంచలన నిజాలు వెలికితీశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ హవిల్దార్ మల్లేశ్‌కు ఆయుధాగారం (వెపన్స్ గోడౌన్) ఇంఛార్జ్‌లు సహకరించినట్లు విచారణలో తేలడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెపన్స్ గోడౌన్ కీపర్లుగా ఉన్న వినోద్, శేషులు నిందితుడు మల్లేశ్‌తో కలిసి ఈ చోరీకి పాల్పడ్డారని ఆధారాలతో సహా గుర్తించారు. వీరి మధ్య భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సాంకేతిక…
అంగన్వాడీ సిబ్బంది సేవలు అభినందనీయంఅంగన్వాడీ టీచర్లకు ఘన సన్మానం
బిచ్కుంద, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్య కోసం అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని బిచ్కుంద బీజేపీ మండల అధ్యక్షుడు శెట్పల్లి విష్ణు అన్నారు. బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామం దోబీవాడలోని అంగన్వాడీ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో అంగన్ మిలాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శెట్పల్లి విష్ణు మాట్లాడుతూ.. చిన్నారులకు ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్య అందించడంలో అంగన్వాడీ…
జమ్మలమడుగులో మెగా మెడికల్ క్యాంపు ప్రారంభం
జమ్మలమడుగు, సెప్టెంబర్ 29: (E6tv NEWS: ప్రతినిధి). ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా ప్రస్థానం, పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ ఉత్సవాల్లో భాగంగా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. రోటరీ క్లబ్లో దేవగుడి శంకర్‌రెడ్డి, సుబ్బరామిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని కడప జిల్లా ఇన్చార్జి మంత్రి, బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి…
13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి ‘షాహిద్’: ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్!
చిత్రపరిశ్రమలో విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు జాతీయ అవార్డులను గెలుచుకున్న బయోపికల్ డ్రామా ‘షాహిద్’ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌పై అందుబాటులోకి వచ్చింది. 2013లో థియేటర్లలో విడుదలైన 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మానవ హక్కుల న్యాయవాది షాహిద్ అజ్మీ జీవిత ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఓటీటీ విడుదలలో చోటుచేసుకున్న ఈ జాప్యంపై చిత్ర…
“నోరు అదుపులో లేకపోతే మహిళలతో కొట్టిస్తా!”:కొండా సురేఖ
వరంగల్ తూర్పు శాసనసభ్యురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ తన రాజకీయ ప్రత్యర్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వరంగల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే మహిళలతో చిత్తుచిత్తుగా కొట్టిస్తానని ఘాటుగా హెచ్చరించారు. ప్రతిపక్ష నేతలు గాలిలో కత్తులు తిప్పుతున్నారంటూ మండిపడ్డారు. హద్దులు మీరి ప్రవర్తించే నాయకులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిస్థితులపై కూడా ఆమె మాట్లాడారు. పార్టీ…
తిరుమల శ్రీవారి దర్శనంలో మంత్రి లోకేష్.. వెంట సింగపూర్ మంత్రి!
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్, సింగపూర్ కేంద్ర మంత్రి కె. షణ్ముగం మంగళవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం తో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శన ఏర్పాట్లపై సింగపూర్ మంత్రి షణ్ముగం హర్షం వ్యక్తం చేశారు. వేలాదిగా భక్తులు తరలివచ్చే ప్రపంచ ప్రసిద్ధ తిరుమల క్షేత్రంలో టిటిడి పరిపాలన, క్యూలైన్ల నిర్వహణ అత్యుత్తమంగా…
బదిరులకు అండగా ఉంటా: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
ఇందూరు, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) జిల్లాలోని బదిరులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. డెఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ బదిరుల్లో ఎంతో మేధాశక్తి, ప్రతిభ దాగి ఉంటుందని అన్నారు. సాధారణ వ్యక్తులతో సమానంగా పోటీ ప్రపంచంలో ముందుకు సాగుతున్న బదిరులను అభినందించారు. బదిరులుగా ఉంటూనే ప్రభుత్వ…
