Hyderabad
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’ కింద దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు గడువును మరో ఐదు రోజుల పాటు పొడిగించింది. ఈ గడువును ఆగస్టు 15 వరకు పొడిగిస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రెండో శనివారం మరియు బోనాల పండుగ సెలవుల కారణంగా అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పథకానికి సంబంధించి ముఖ్యాంశాలు: నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తుల…
🇮🇳 భీంగల్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ
భీంగల్, ఆగస్టు 10: E6 tv NEWS (T. గంగాధర్)దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటిచెప్పే ఉద్దేశంతో భీంగల్ పట్టణంలో ఆగస్టు 11న తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు వందేమాతరం ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.మంగళవారం ఉదయం 10 గంటలకు సుదర్శన్ థియేటర్ వద్ద ర్యాలీ ప్రారంభమై సుమంగళి చౌరస్తా వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. భీంగల్ పట్టణ, మండల ప్రజలు, యువతీ యువకులు కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. “దేశం కోసం…..
భీంగల్‌లో అంగన్వాడీ ఉద్యోగుల ర్యాలీ.. రాస్తారోకో
భీంగల్, ఆగస్టు 10: E6 tv NEWS (T. గంగాధర్) దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక సంఘాల పిలుపులో భాగంగా భీంగల్ పట్టణంలో అంగన్వాడీ ఉద్యోగులు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కైరిదేవ గంగు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల గోవర్ధన్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర…
ప్రైమ్ ల్యాబ్ క్లినికల్ లేబొరేటరీ ప్రారంభం
నిర్మల్ ఆగస్టు 10: E6 tv NEWS(Md. ఆమీనుద్దీన్). నిర్మల్ పట్టణంలో ప్రైమ్ ల్యాబ్ క్లినికల్ లేబొరేటరీని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెరుగైన వైద్యం అందించడంలో రక్త పరీక్షలు ఎంతో కీలకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందేందుకు వైద్యుల సూచనల మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముందస్తు పరీక్షల…
బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్
ఏర్గట్ల మండల కేంద్రంలో పలు కుటుంబాలకు పరామర్శ ఏర్గట్ల ఆగస్టు 9: E6 tv NEWS (T. గంగాధర్). బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఏర్గట్ల మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెరుగు గొల్ల వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన నివాసానికి వెళ్లిన ముత్యాల సునీల్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని…
మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్‌లు అందించాలి
మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సున్నపు ఓంకార్ డిమాండ్ భీంగల్ ఆగస్టు 9: (E6 tv NEWS: T. గంగాధర్). భీంగల్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులకు గత రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న యూనిఫామ్‌లను వెంటనే అందించాలని మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సున్నపు ఓంకార్ డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్‌లు అందించాల్సి ఉన్నప్పటికీ, గత రెండేళ్లుగా అధికారులు వాటిని అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్‌లు…
బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
బాన్సువాడ ఆగస్టు 9: (E6 tv న్యూస్ ప్రతినిధి). యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ మన్సూర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, పండ్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత సమస్యల పరిష్కారం, నిరుద్యోగ నిర్మూలన, పేపర్ లీకుల నివారణ, ధరల పెరుగుదల నియంత్రణతో పాటు రైతుల సమస్యల…
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహానికి భారీగా తరలిరావాలి
మద్నూర్, ఆగస్టు 9: E6 tv NEWS (M. మస్నాజీ).మద్నూర్ మండల ప్రజలందరికీ పెద్ద ఎక్వొర సర్పంచ్ సోమర్ మహేష్ ఒక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు గారి కుమార్తె వివాహ వేడుక ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని పేర్కొన్నారు. కందర్పల్లి DBL సమీపంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి మద్నూర్ మండల ప్రజలు పెద్ద…
అన్నాభావు సాథే విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లపై మాదిగ నాయకుల చర్చ
మద్నూర్, ఆగస్టు 9: E6 tv NEWS (M. మస్నాజీ)హాసన్ టాక్లి గ్రామంలో ఈ నెల 30వ తేదీన సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాథే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మాదిగ జాతి ముద్దుబిడ్డ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరుకానున్న నేపథ్యంలో ఉమ్మడి మద్నూర్ మండలానికి చెందిన మాదిగ నాయకులు హాసన్ టాక్లి గ్రామాన్ని సందర్శించి కార్యక్రమ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్, గ్రామస్థులతో సమావేశమై విగ్రహావిష్కరణ, సభ,…
ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే దొరకడం ఇందూరు యువత అదృష్టం: సీపీ సాయి చైతన్య
మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి 70కి పైగా కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు.. 2,500 మందికి పైగా అభ్యర్థుల హాజరు నిజామాబాద్, ఆగస్టు 9: (E6 tv NEWS, శివ ఠాకూర్).ప్రజాభివృద్ధితో పాటు యువత భవిష్యత్తు కోసం కృషి చేసే ఎమ్మెల్యే దొరకడం నిజామాబాద్ యువత అదృష్టమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీరామ గార్డెన్స్‌లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్…
