Breaking News

బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్

ఏర్గట్ల మండల కేంద్రంలో పలు కుటుంబాలకు పరామర్శ

ఏర్గట్ల ఆగస్టు 9: E6 tv NEWS (T. గంగాధర్).

బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఏర్గట్ల మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు.

మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెరుగు గొల్ల వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన నివాసానికి వెళ్లిన ముత్యాల సునీల్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వెంకన్న మృతి పార్టీకి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

అనంతరం అదే మండల కేంద్రానికి చెందిన చిన్న బాలయ్య ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సునీల్ కుమార్ తెలిపారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *