Breaking News

మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్‌లు అందించాలి

మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సున్నపు ఓంకార్ డిమాండ్

భీంగల్ ఆగస్టు 9: (E6 tv NEWS: T. గంగాధర్).

భీంగల్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులకు గత రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న యూనిఫామ్‌లను వెంటనే అందించాలని మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సున్నపు ఓంకార్ డిమాండ్ చేశారు.

ప్రతి సంవత్సరం మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్‌లు అందించాల్సి ఉన్నప్పటికీ, గత రెండేళ్లుగా అధికారులు వాటిని అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్‌లు అందించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని అమలు చేయకపోవడం బాధాకరమన్నారు.ఎండ, వర్షాలను లెక్కచేయకుండా పట్టణ పారిశుద్ధ్యాన్ని కాపాడటంతో పాటు వివిధ పనుల్లో కార్మికులు నిత్యం సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి కార్మికుల సంక్షేమం, భద్రత పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు.

వర్షాకాలంలో పారిశుద్ధ్య పనులు మరింత సవాలుగా మారుతున్న నేపథ్యంలో కార్మికులకు యూనిఫామ్‌లతో పాటు రక్షణ సామగ్రి, భద్రతా పరికరాలను సకాలంలో అందించాలని కోరారు. ఇప్పటికే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రేయిన్ జాకెట్లు పంపిణీ చేసినప్పటికీ, పెండింగ్‌లో ఉన్న యూనిఫామ్ బట్టలను కూడా వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.కార్మికులకు యూనిఫామ్‌లు అందించడం ద్వారా విధుల్లో వారికి భద్రతతో పాటు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని తెలిపారు. అధికారులు కార్మికుల సమస్యలను పట్టించుకోకపోతే మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్య పరిష్కారం కోసం తదుపరి కార్యాచరణ చేపడతామని సున్నపు ఓంకార్ హెచ్చరించారు.

పెండింగ్‌లో ఉన్న యూనిఫామ్‌లను తక్షణమే అందించి, కార్మికులకు విధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కార్మికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *