బాన్సువాడ ఆగస్టు 9: (E6 tv న్యూస్ ప్రతినిధి).
యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ మన్సూర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, పండ్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత సమస్యల పరిష్కారం, నిరుద్యోగ నిర్మూలన, పేపర్ లీకుల నివారణ, ధరల పెరుగుదల నియంత్రణతో పాటు రైతుల సమస్యల పరిష్కారం కోసం యువజన కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.ప్రజా సమస్యలపై యువతను చైతన్యపరుస్తూ, అవసరమైన సందర్భాల్లో ప్రజల తరఫున పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాందేవ్, సర్పంచ్ అందే రమేశ్, గౌస్, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.


