Breaking News

అన్నాభావు సాథే విగ్రహా ఆవిష్కరణ  కార్యక్రమ ఏర్పాట్లపై మాదిగ నాయకుల చర్చ

మద్నూర్, ఆగస్టు 9: E6 tv NEWS (M. మస్నాజీ)
హాసన్ టాక్లి గ్రామంలో ఈ నెల 30వ తేదీన సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాథే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మాదిగ జాతి ముద్దుబిడ్డ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరుకానున్న నేపథ్యంలో ఉమ్మడి మద్నూర్ మండలానికి చెందిన మాదిగ నాయకులు హాసన్ టాక్లి గ్రామాన్ని సందర్శించి కార్యక్రమ వివరాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్, గ్రామస్థులతో సమావేశమై విగ్రహావిష్కరణ, సభ, ఇతర కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు.అన్నాభావు సాథే సేవలు, సాహిత్య రంగానికి ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో సూర్యవంశీ యాదవ్, విజయ్, శేకాపూర్ తుకారాం, హనుమంత్, మిర్రేవార్ సాయిలు తదితర మాదిగ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *