Breaking News

🇮🇳 భీంగల్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ

భీంగల్, ఆగస్టు 10: E6 tv NEWS (T. గంగాధర్)
దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటిచెప్పే ఉద్దేశంతో భీంగల్ పట్టణంలో ఆగస్టు 11న తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు వందేమాతరం ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.మంగళవారం ఉదయం 10 గంటలకు సుదర్శన్ థియేటర్ వద్ద ర్యాలీ ప్రారంభమై సుమంగళి చౌరస్తా వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. భీంగల్ పట్టణ, మండల ప్రజలు, యువతీ యువకులు కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

“దేశం కోసం.. జాతీయ జెండా కోసం.. ఐక్యత కోసం” ప్రతి ఒక్కరూ తిరంగా ర్యాలీలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు. జాతీయ జెండా ఔన్నత్యాన్ని చాటేలా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

ర్యాలీ వివరాలు:
📍 ప్రారంభం: సుదర్శన్ థియేటర్, భీంగల్
➡️ ముగింపు: సుమంగళి చౌరస్తా
🗓️ తేదీ: ఆగస్టు 11, 2026
⏰ సమయం: ఉదయం 10 గంటలకు

వందేమాతరం ఫౌండేషన్, భీంగల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

వందేమాతరం 🇮🇳 | జై హింద్ 🇮🇳

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *