మద్నూర్, ఆగస్టు 9: E6 tv NEWS (M. మస్నాజీ).
మద్నూర్ మండల ప్రజలందరికీ పెద్ద ఎక్వొర సర్పంచ్ సోమర్ మహేష్ ఒక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు గారి కుమార్తె వివాహ వేడుక ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని పేర్కొన్నారు. కందర్‌పల్లి DBL సమీపంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి మద్నూర్ మండల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.
మండల ప్రజలందరూ కుటుంబ సమేతంగా తరలివచ్చి వివాహ వేడుకను విజయవంతం చేయడంతో పాటు, జుక్కల్ ఎమ్మెల్యే కుటుంబానికి తమ శుభాకాంక్షలు తెలియజేయాలని పెద్ద ఎక్వొర సర్పంచ్ సోమర్ మహేష్ విజ్ఞప్తి చేశారు.


