Hyderabad
తెలంగాణ అసెంబ్లీ గేట్ వద్ద రణరంగం:కేటీఆర్, హరీశ్ రావు అరెస్ట్!
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, నెరవేర్చని హామీలను నిరసిస్తూ నల్ల టీషర్ట్లు ధరించి సభకు హాజరయ్యేందుకు వచ్చిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అసెంబ్లీ గేట్ వద్దే అడ్డుకోవడంతో వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ప్రవేశాన్ని నిరాకరించారు. ప్లకార్డులు, నల్ల టీషర్ట్‌లతో లోపలికి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేయడంతో ఇరువర్గాల మధ్య…
అసెంబ్లీలో రచ్చ: బీజేపీ ఆందోళనతో సభ వాయిదా
హైదరాబాద్ (E6TV): తెలంగాణ శాసనసభలో 22ఏ (నిషేధిత భూముల) అంశం తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రంలో జరుగుతున్న భూ దందాలు, నిషేధిత జాబితాలో భూముల కేటాయింపులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శాసనసభ్యులు సభలో ఆందోళనకు దిగారు. వాయిదా తీర్మానంపై పట్టు: ఉదయం సభ ప్రారంభం కాగానే 22ఏ భూముల అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఆమోదించి వెంటనే చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. అయితే, ఈ సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వం…
శిరీష హత్యాచార ఘటనపై నేడు రౌండ్ టేబుల్ సమావేశం
రాజకీయ, ప్రజా, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో సమావేశం కొత్తగూడెం:, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కౌటిగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి శిరీష హత్య, అత్యాచారం ఘటనపై కార్యాచరణ రూపొందించేందుకు సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా తెలిపారు.సోమవారం ఉదయం 11.30 గంటలకు కొత్తగూడెంలోని సీపీఐ జిల్లా కార్యాలయం ‘శేషగిరిభవన్’లో రాజకీయ, ప్రజా, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు…
పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్
జిల్లా వ్యాప్తంగా 1,216 దరఖాస్తులు.. 1,030 మంది అభ్యర్థులు హాజరు కొత్తగూడెం, సెప్టెంబర్ 7: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్-ఇన్స్పెక్టర్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1,216 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1,030 మంది పరీక్షకు హాజరయ్యారు.అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి, పరీక్షను ప్రశాంతంగా,…
దశాబ్దాల రైతుల కల సాకారం!
మారెళ్లపాడు లిఫ్ట్‌లో గోదావరి పరవళ్లు.. 16,180 ఎకరాలకు సాగునీటి భరోసా అశ్వాపురం, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). మణుగూరు, అశ్వాపురం మండలాల రైతుల కళ్లలో దశాబ్దాలుగా మెదులుతున్న సాగునీటి కల సాకారమైంది. వర్షాలు సరిగా లేక భూగర్భ జలాలు అడుగంటడంతో బీడుగా మారిన భూములకు గోదావరి జలాలను అందించాలన్న రైతుల చిరకాల వాంఛ మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకంతో నెరవేరే దిశగా కీలక అడుగు పడింది. మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తవడంతో ఆయకట్టు…
తుమ్మల చెరువు రైతుల సాగునీటి కల నెరవేరే దిశగా కీలక అడుగు
మారెళ్లపాడు లెఫ్ట్ కెనాల్ ట్రయల్ రన్ సక్సెస్.. రైతుల్లో ఆనందోత్సాహాలు అశ్వాపురం, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). తుమ్మల చెరువు రైతుల చిరకాల సాగునీటి కల సాకారం దిశగా కీలక ముందడుగు పడింది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక చొరవతో చేపట్టిన మారెళ్లపాడు లెఫ్ట్ కెనాల్ ట్రయల్ రన్ విజయవంతమైంది. దీంతో తుమ్మల చెరువు ఆయకట్టు రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గోదావరి జలాలను తుమ్మల చెరువుకు తరలించి తమ పొలాలకు సాగునీరు అందించాలన్నది ఈ ప్రాంత…
అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం
ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య పరీక్షలు: ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాచలం–చర్ల రోడ్డులో రాధా హాస్పిటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన అపోలో డయాగ్నస్టిక్ సెంటర్‌ను భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. మల్ల ప్రతాప్ కుమారుడు నూతనంగా ఏర్పాటు చేసిన అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా భద్రాచలం, పరిసర ప్రాంతాల…
స్థానిక యాష్ చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలి
KTPS యాష్ టెండర్‌పై TGGENCO సివిల్ డైరెక్టర్‌తో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ చర్చ పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). KTPS యాష్ లిఫ్టింగ్ పనులను KTPP, BTPS, YTPSతో కలిపి ఒకే భారీ టెండర్‌గా నిర్వహించే విధానాన్ని పునఃపరిశీలించి, స్థానిక చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ కోరారు. పాల్వంచకు వచ్చిన ఆయన ధరావత్ సురేష్ నివాసంలో స్థానిక యాష్ కాంట్రాక్టర్లు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు….
భీంగల్‌లో అక్రమ ఇసుక రవాణా.. రెండు ట్రాక్టర్లు పట్టివేత
అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా పోలీసుల తనిఖీలు భీంగల్, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). మున్సిపల్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను భీంగల్ పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. శనివారం వాగు నుంచి ఇసుక తరలింపునకు ఎమ్మార్వో ఆదేశాల మేరకు అనుమతులు ఉన్నప్పటికీ, ఆదివారం ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లపై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అక్రమ ఇసుక రవాణా జరుగుతోందన్న సమాచారం అందడంతో భీంగల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ…
1000 రోజుల ప్రజా పాలన విజయోత్సవాలు
ఏర్గట్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు – భారీ బైక్ ర్యాలీ ఏర్గట్ల, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి)..తెలంగాణలో రేవంత్ అన్న ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు కావస్తున్న సందర్భంగా ఏర్గట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ పథకాల విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జెండాలతో బైక్‌లపై ర్యాలీగా మండల కేంద్రంలోని ప్రధాన…
