ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య పరీక్షలు: ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలం, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాచలం–చర్ల రోడ్డులో రాధా హాస్పిటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన అపోలో డయాగ్నస్టిక్ సెంటర్‌ను భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. మల్ల ప్రతాప్ కుమారుడు నూతనంగా ఏర్పాటు చేసిన అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా భద్రాచలం, పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య పరీక్షలు స్థానికంగానే అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య పరీక్షలు అందించే విధంగా కేంద్రం పనిచేయాలని ఆకాంక్షించారు.
ప్రజలకు అవసరమైన వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం వల్ల సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిర్వాహకులు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందాలని సూచించారు.అనంతరం డయాగ్నస్టిక్ సెంటర్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి, ప్రజలకు అందించే సేవల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ, ఉపసర్పంచ్ రత్నం కవిత, వార్డు సభ్యులు నర్రా వాణి, కారం దుర్గారావు, పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

