Breaking News

భీంగల్‌లో అక్రమ ఇసుక రవాణా.. రెండు ట్రాక్టర్లు పట్టివేత

అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా పోలీసుల తనిఖీలు

భీంగల్, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి).

మున్సిపల్‌ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను భీంగల్‌ పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. శనివారం వాగు నుంచి ఇసుక తరలింపునకు ఎమ్మార్వో ఆదేశాల మేరకు అనుమతులు ఉన్నప్పటికీ, ఆదివారం ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లపై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

అక్రమ ఇసుక రవాణా జరుగుతోందన్న సమాచారం అందడంతో భీంగల్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ట్రాక్టర్లను భీంగల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *