Breaking News

1000 రోజుల ప్రజా పాలన విజయోత్సవాలు

ఏర్గట్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు – భారీ బైక్ ర్యాలీ

ఏర్గట్ల, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి)..
తెలంగాణలో రేవంత్ అన్న ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు కావస్తున్న సందర్భంగా ఏర్గట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ పథకాల విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జెండాలతో బైక్‌లపై ర్యాలీగా మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా సాగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేశారు.అనంతరం టపాకాయలు పేల్చి, స్వీట్లు పంపిణీ చేసుకొని కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *