KTPS యాష్ టెండర్‌పై TGGENCO సివిల్ డైరెక్టర్‌తో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ చర్చ
పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి).
KTPS యాష్ లిఫ్టింగ్ పనులను KTPP, BTPS, YTPSతో కలిపి ఒకే భారీ టెండర్‌గా నిర్వహించే విధానాన్ని పునఃపరిశీలించి, స్థానిక చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ కోరారు. పాల్వంచకు వచ్చిన ఆయన ధరావత్ సురేష్ నివాసంలో స్థానిక యాష్ కాంట్రాక్టర్లు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అజ్మీరా సీతారాం నాయక్ మాట్లాడుతూ.. KTPSలో అనేక సంవత్సరాలుగా స్థానిక చిన్న కాంట్రాక్టర్లు యాష్ లిఫ్టింగ్, రవాణా పనులు నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ పనులపై డ్రైవర్లు, క్లీనర్లు, కార్మికులు, వాహన యజమానులు, చిన్న వ్యాపారులు తదితర అనేక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు.ప్రస్తుతం KTPSతో పాటు KTPP, BTPS, YTPS నాలుగు థర్మల్ పవర్ ప్లాంట్ల యాష్‌ను కలిపి ఒకే Comprehensive Tenderగా అప్పగించే విధానం వల్ల స్థానిక చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ టర్నోవర్, నెట్‌వర్త్, వాహనాలు, యాష్ నిర్వహణ అనుభవం వంటి అర్హతలను నిర్దేశించడం వల్ల సంవత్సరాలుగా ఈ రంగంలో పనిచేస్తున్న స్థానిక కాంట్రాక్టర్లు టెండర్‌లో పాల్గొనే అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
TGGENCO సివిల్ డైరెక్టర్‌తో ఫోన్‌లో చర్చ
స్థానిక కాంట్రాక్టర్ల సమస్యలను TGGENCO ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన మాజీ ఎంపీ.. TGGENCO సివిల్ డైరెక్టర్ అజయ్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను వివరించారు. KTPSను మిగిలిన మూడు ప్లాంట్లతో కలిపి ఒకే భారీ ప్యాకేజీగా కాకుండా KTPSకు ప్రత్యేకంగా టెండర్ నిర్వహించాలని లేదా టెండర్‌ను పలు లాట్లుగా విభజించి స్థానిక చిన్న కాంట్రాక్టర్లకు కూడా పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు.పెద్ద సంస్థలు టెండర్‌లో పాల్గొనడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే KTPSపై సంవత్సరాలుగా ఆధారపడి జీవిస్తున్న స్థానిక కాంట్రాక్టర్లకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. స్థానికుల ఉపాధి, సమాన పోటీ, పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని టెండర్ విధానాన్ని పునఃపరిశీలించాలని TGGENCO అధికారులను కోరారు.
స్థానిక కాంట్రాక్టర్లకు న్యాయం జరిగే వరకు ఈ అంశాన్ని ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి అసెంబ్లీలో చర్చించే విధంగా ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు భూక్యా సీతారాం నాయక్, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, బోడ పుణ్యనాయక్, ధరావత్ సురేష్, గుగులోత్ శంకర్, బానోత్ గంగా, బానోత్ వెంకటేష్, భట్టు నరేష్, భట్టు మధు, ధరావత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

