Breaking News

యువత భవిష్యత్‌కు పోలీస్ శాఖ చేయూత

పోలీస్ ఉద్యోగ లక్ష్యానికి 300 మంది యువతకు ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ నిర్మల్, అక్టోబర్ 1:(E6tv NEWS: ప్రతినిధి). పోలీస్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, IAS సహకారంతో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS ఆధ్వర్యంలో నిర్మల్ పోలీస్ బ్రీఫింగ్ హాల్‌లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తం 300…

Read Full News

అభివృద్ధికి కేంద్ర-రాష్ట్రాల సహకారం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ కాంప్లెక్స్ (ఐడీవోసి)ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ, సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి విషయాల్లో కేంద్రంతో కలిసి పనిచేస్తామని, రాష్ట్ర సమస్యల…

Read Full News

సిరిసిల్లా ‘గడి’పై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

బిఆర్‌ఎస్ అగ్రనేత కె.టి.రామారావు సొంత నియోజకవర్గం రాజన్న సిరిసిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ కుటుంబ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ ‘గడి’ కూలినట్లే, వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లా ‘గడి’ని బద్దలు కొట్టి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్ల కాలంలో కెసిఆర్ కుటుంబం రూ. లక్ష కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టి రాష్ట్రంలోనే అత్యంత ధనవంతులుగా మారారని సీఎం ఆరోపించారు. కేటీఆర్ హైటెక్ సిటీ…

Read Full News

రెవెన్యూ సేవలు సకాలంలో అందించాలి

పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: ధర్మవరం ఆర్డీఓ ఓ. రామ భూపాల్ రెడ్డి చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి).ప్రజలకు రెవెన్యూ సేవలను నిర్ణీత గడువులోగా అందించాలని ధర్మవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఓ. రామ భూపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం డివిజన్ పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండల కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆర్డీఓ.. పెండింగ్ దరఖాస్తులు, పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులు,…

Read Full News

పాలనలో ఉద్యోగులదే కీలక పాత్ర: సీఎం రేవంత్!

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమగ్ర కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించి, ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన సీఎం, పేదల సమస్యల పరిష్కార వేదికలుగా కలెక్టరేట్ కార్యాలయాలు ఉపయోగపడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో 10.5 లక్షల మంది ఉద్యోగులే కీలక…

Read Full News

హార్టీకల్చర్ హబ్‌తో రాయలసీమ అభివృద్ధి: మంత్రి సవిత

రూ.లక్ష కోట్లతో హార్టీకల్చర్ హబ్‌.. అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు శ్రీకారం పులివెందులలో భారీ ట్రాక్టర్ ర్యాలీ.. స్వయంగా ట్రాక్టర్ నడిపిన మంత్రి పులివెందుల/కడప: సెప్టెంబర్ 30 (E6tv NEWS: ప్రతినిధి). రాయలసీమలో రూ.లక్ష కోట్లతో ఏర్పాటు చేయనున్న హార్టీకల్చర్ హబ్‌తో ఉద్యానవన సాగులో ప్రాంతం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత తెలిపారు.మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న మదనపల్లెలో…

Read Full News

డి-46 కాలువ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలి

ఆకుల గోపాల్‌ను తిరిగి కాలువ ఇన్‌స్పెక్టర్‌గా నియమించాలి నీటిపారుదల శాఖ అధికారికి రైతుల వినతి… ఎడపల్లి, సెప్టెంబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ప్రధాన కాలువ నుంచి డి-46 ఉపకాలువకు సాగునీరు చేరుతుంది. ఈ కాలువ ఆయకట్టు కింద ఎడపల్లి, దుబ్బతండా, బ్రాహ్మణపల్లి గ్రామాలతో పాటు బోధన్ మండలంలోని పెంటకలాన్, పెగడపల్లి, బర్దిపూర్, భూలక్ష్మి గ్రామాలకు చెందిన రైతులు సాగు చేస్తున్నారు.ప్రస్తుతం పంటలు కోత దశకు చేరుకున్నప్పటికీ సకాలంలో సాగునీరు అందకపోవడంతో…

Read Full News

గడ్కోల్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏం జరుగుతోంది?

రైతులకు క్రాప్‌ లోన్లలో ఇబ్బందులు.. రుణం కోసం పలుమార్లు తిరుగుతున్న ఖాతాదారులు బంగారు రుణం చెల్లించినా నగలు తిరిగి ఇవ్వడం లేదన్న ఆరోపణలు బ్యాంకు సిబ్బంది తీరుపై ఖాతాదారుల ఆవేదన.. ఉన్నతాధికారులు స్పందించాలంటున్న గ్రామస్తులు సిరికొండ, సెప్టెంబర్ 30:(E6tv NEWS: శివ ఠాకూర్).బ్యాంకులు సామాన్య ప్రజలకు ఆర్థిక సేవలు అందించాల్సిన సంస్థలు. ముఖ్యంగా రైతులకు పంట రుణాలు, వ్యవసాయ రుణాలు సకాలంలో అందించి వారికి అండగా నిలవాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంటుంది. అయితే సిరికొండ మండలం గడ్కోల్…

Read Full News

సీఎంగా తొలిసారి సిరిసిల్లకు రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభ

ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం కరీంనగర్ నుంచి సిరిసిల్ల చేరుకోనున్న సీఎం, అంబేద్కర్ చౌరస్తా నుంచి ఫూలే, నేతన్న విగ్రహాలను సందర్శిస్తూ బహిరంగ సభా వేదిక వరకు పాదయాత్రగా వెళ్లనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లావ్యాప్తంగా మొత్తం రూ.345.78 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో సిరిసిల్లలో నేతన్న బజార్, రూ.200 కోట్లతో…

Read Full News

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో రైతులకు మరింత ప్రయోజనం

లక్కంపల్లి సెజ్‌లో అనువైన స్థలాల పరిశీలన.. రైస్ బ్రాన్ ఆయిల్, సోయా పరిశ్రమల ఏర్పాటుకు కృషి… నిజామాబాద్, సెప్టెంబర్ 30:(E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే స్థానిక రైతాంగానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం నందిపేట మండలం లక్కంపల్లి సెజ్ పరిసర ప్రాంతాల్లో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన స్థలాలను ఆయన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్….

Read Full News