Khamam
వేంసూరు మండలంలో అధికారుల పనితీరుపై ప్రజల ఆగ్రహం
ప్రభుత్వ లక్ష్యాలకు కొందరు అధికారుల తీరుతో గండి? ప్రజావాణి ప్రచారంలో నిర్లక్ష్యం.. ప్రజలకు అందని సంక్షేమ పథకాలు ప్రజావాణి ప్రచారంలో నిర్లక్ష్యం.. ప్రజలకు అందని సంక్షేమ పథకాలు స్థానికంగా అందుబాటులో లేని సిబ్బందిపై మండల ప్రజల అసంతృప్తి పనితీరులో మార్పు లేకుంటే చర్యలు తప్పవంటున్న ప్రజాప్రతినిధులు వేంసూరు,ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).ప్రజలకు సంక్షేమ పాలన అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి కొందరు అధికారుల పనితీరు అడ్డంకిగా మారుతోందని వేంసూరు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను…
భీమ్‌గల్ అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోంది: వేముల ప్రశాంత్‌రెడ్డి
రూ.35 కోట్ల 100 పడకల ఆసుపత్రి, రూ.3.50 కోట్ల సమీకృత మార్కెట్, సీసీ–బీటీ రోడ్లు, బస్ డిపో పనులు పూర్తి చేయాలి పెండింగ్ బిల్లులు విడుదల చేసి అసంపూర్తి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ భీమ్‌గల్ ఆగస్ట్ 19: (E6tv NEWS ప్రతినిధి). భీమ్‌గల్ పట్టణ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై, 70–75 శాతం వరకు పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు నిలిపివేసి అర్ధాంతరంగా నిలిపివేసిందని మాజీ…
సలాబాత్‌పూర్ గ్రామానికి నూతన పోలింగ్ బూత్
మద్నూర్ ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి). ఏళ్లుగా ఎదురుచూస్తున్న సలాబాత్‌పూర్ గ్రామస్థుల సమస్యకు పరిష్కారం లభించింది. సలాబాత్‌పూర్ గ్రామానికి ప్రత్యేకంగా నూతన పోలింగ్ బూత్ మంజూరు కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మద్నూర్ మండలం చిన్న శక్కార్గ గ్రామపంచాయతీ పరిధిలోని సలాబాత్‌పూర్, చిన్న శక్కార్గ గ్రామాలకు గతంలో ఒకే పోలింగ్ బూత్ ఉండేది. దీంతో ప్రతి ఎన్నికల సమయంలో సలాబాత్‌పూర్ గ్రామస్థులు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని చిన్న శక్కార్గ గ్రామానికి వెళ్లి తమ ఓటు…
ఎంపీడీఓ సాయిలును సన్మానించిన మెనూర్ సర్పంచ్
మద్నూర్, ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పి. సాయిలును మెనూర్ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పి. సాయిలు మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థుల సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. మద్నూర్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా పనిచేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ…
ప్రపంచ ఫోటోగ్రఫీ డేలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదు ఫోటో జర్నలిస్టుల సేవలు అమోఘం ఇందూరు, ఆగస్టు 19:( E6tv NEWS:శివ ఠాకూర్). ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా నగరంలోని ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఫోటోగ్రాఫర్ అంటే కేవలం కెమెరా ఆపరేటర్ కాదని, సమాజంలో జరిగే మంచి, చెడు, చారిత్రక సంఘటనలను భవిష్యత్ తరాలకు…
పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ నిజామాబాద్, ఆగస్టు 18: (E6tv NEWS: శివ ఠాకూర్). తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల…
పాపన్న ఆశయాలు నెరవేర్చినప్పుడే అసలైన నివాళి
నిర్మల్, ఆగస్టు 18: (E6tv NEWS:A. తిరుపతి గౌడ్) సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గౌడ సంఘాల నాయకులు, వివిధ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రతినిధులు పాల్గొని సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్, జిల్లా రెవెన్యూ అధికారి…
ఎంపీ అరవింద్‌పై విమర్శలు చేస్తే ఊరుకోం
బీజేపీ కార్పొరేటర్ల హెచ్చరిక నిజామాబాద్ ఆగస్టు 18: (E6tv NEWS: శివ ఠాకూర్) నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను బీజేపీ కార్పొరేటర్లు తీవ్రంగా ఖండించారు. ఎంపీ అరవింద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీజేపీ శ్రేణులు చూస్తూ ఊరుకోవని 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ హెచ్చరించారు.జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రం సుధీర్, 22వ డివిజన్ కార్పొరేటర్ సాయి వైష్ణవి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు తగినన్ని…
పాఠశాలల ఆరోగ్యం బలోపేతానికి ప్రత్యేక చర్యలు
నిజామాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: శివ ఠాకూర్). జిల్లాలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (RBSK)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ RBSK మొబైల్ హెల్త్ టీంలు ప్రతి పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆరు నెలలకు ఒకసారి…
హుజూర్‌నగర్‌లో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన
హుజూర్‌నగర్, ఆగస్టు 17:(E6tv NEWS: ప్రతినిధి). మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఐపీఎస్ ఆదేశాల మేరకు హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, ఎస్‌ఐ చలిగంటి నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ కళాబృందం ద్వారా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్…

