Khamam
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
దేశ ఐక్యత, అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి: జుక్కల్ ఎమ్మెల్యే జుక్కల్ ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలంతా కలిసికట్టుగా…
మద్నూర్ ఎంపీడీవోగా పి. సాయిలు బాధ్యతలు
మద్నూర్, ఆగస్టు 15:(E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. వేల్పూర్ మండలంలో విధులు నిర్వహించిన ఆయన పదోన్నతిపై మద్నూర్ ఎంపీడీవోగా నియమితులయ్యారు.ఇప్పటివరకు మద్నూర్ ఇన్‌చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహించిన సత్యనారాయణరెడ్డి నుంచి స్వాతంత్ర్య దినోత్సవం రోజున పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పి. సాయిలు జాతీయ జెండాను ఆవిష్కరించి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
త్యాగధనుల పోరాట ఫలితమే స్వాతంత్ర్యం: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
నిజామాబాద్ ఆగస్టు 15: E6tv NEWS (శివ ఠాకూర్). దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన నిరంతర పోరాటం, త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్, హైదరాబాద్, ఆగస్టు 15: (E6 tv NEWS: ప్రతినిధి) బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ కాలం నాటి ఆలోచన విధానాలను వీడాలి ఈ సందర్భంగా…
టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించిన ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సమిష్టిగా పనిచేయాలని పిలుపు నిజామాబాద్, ఆగస్టు 15:(E6 tv NEWS: శివ ఠాకూర్). దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ కార్యాలయంలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల…
ఏర్గట్లలో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై అవగాహన
ఏర్గట్ల ఆగస్టు 14: (E6tv NEWS: T, గంగాధర్). మండల కేంద్రంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఏర్గట్ల సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి కోరారు. వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌తో కలిసి ఆయన గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా కిరాణా దుకాణాలు, చికెన్ సెంటర్లు, హోటళ్లను స్వయంగా సందర్శించి వ్యాపారులకు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పర్యావరణహిత బయో ప్లాస్టిక్ బ్యాగులను సర్పంచ్, వార్డు సభ్యులు…
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కామారెడ్డి, ఆగస్టు 14: (E6 tv NEWS: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 15న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు,…
పెన్షన్ల కోసం ప్రత్యేక క్యాంపు
నిర్మల్ ఆగస్టు 14: (E6 tv NEWS ప్రతినిధి). నిర్మల్ జిల్లా విశ్వనాథ్‌పేట్‌లోని ఈడెన్ గార్డెన్‌లో స్థానిక కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక క్యాంపు నిర్వహించారు. వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి ఈ క్యాంపు ద్వారా అవగాహన కల్పించారు.అర్హులైన ప్రజలు తమ ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డులతో క్యాంపునకు వచ్చి అవసరమైన వివరాలు సమర్పించాలని కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా కోరారు. తెలంగాణ…
వనమహోత్సవంలో భాగంగా ఇంటింటికీ మొక్కల పంపిణీ
భీంగల్, ఆగస్టు 14: (E6 tv NEWS ప్రతినిధి). ప్రభుత్వ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని 1వ నుంచి 6వ వార్డుల్లో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మహిళలకు మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ హాజరయ్యారు. 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు, 2వ వార్డు…
దివ్యాంగుల సంక్షేమంపై కేంద్ర మంత్రితో ఎంపీ అర్వింద్ భేటీ
న్యూఢిల్లీ ఆగస్టు 12: (E6 tv NEWS ప్రతినిధి). ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్‌ను న్యూఢిల్లీలో కలిశారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, సహాయక పరికరాల పంపిణీ, ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలను ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీల్‌చైర్లు, వినికిడి పరికరాలు,…

