Breaking News

ఈనెల 23న మున్నూరు కాపు దసరా ఆత్మీయ సమ్మేళనం

జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ నిజామాబాద్, అక్టోబర్ 21: (E6tv న్యూస్:శివ ఠాకూర్). నిజామాబాద్ జిల్లాలోని మున్నూరు కాపు కుటుంబాల ఐక్యత, ఆత్మీయతను పెంపొందించేందుకు ఈనెల 23వ తేదీన దసరా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు నిజామాబాద్ మాజీ మేయర్, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ తెలిపారు. ప్రగతినగర్ లోని మున్నూరు కాపు సంఘం భవనంలో నిర్వహించనున్న ఈ సమ్మేళనానికి జిల్లాలోని ప్రతి మున్నూరు కాపు కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఆయన…

Read Full News

బతుకమ్మ వేడుకల్లో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి!

హైదరాబాద్: తెలంగాణలో బతుకమ్మ వేడుకలు తీవ్ర విషాదాన్ని నింపాయి. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం గ్రామంలో బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా.. భారీ శబ్దంతో మోగుతున్న డీజే సౌండ్ కారణంగా యాళగడ భారతి (55) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డీజే హై-వాల్యూమ్ శబ్దం వల్లే ఆమె గుండె ఆగిపోయి…

Read Full News

మీనూరులో దసరా బంగారం సందడి

జమ్మి ఆకులను బంగారంగా భావించి పంచుకున్న గ్రామస్తులు మీనూరు, అక్టోబర్ 21 (E6tv న్యూస్). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మీనూరు గ్రామంలో విజయదశమి పండుగ సందర్భంగా దసరా బంగారం సందడి నెలకొంది. గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా జమ్మి ఆకులను బంగారంగా భావించి ఒకరికొకరు పంచుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆప్యాయతను చాటుకున్నారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ గ్రామంలో ఆనందోత్సాహాల మధ్య సాగింది. జమ్మి ఆకులను…

Read Full News

నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

రుద్రూర్, అక్టోబర్ 21 (E6tv న్యూస్). నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో కీ.శే. ఇందూరు జగన్ మోహన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం 10 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. జగన్ మోహన్ కుమారులు ఇందూరు శ్రీధర్, శ్రీకాంత్‌ల సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూరు శ్రీధర్ మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు తమ వంతు…

Read Full News

బాన్సువాడలో ఘనంగా రావణదహనం

కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, అక్టోబర్ 21 (E6tv న్యూస్). విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో నిర్వహించిన రావణదహన కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, మున్సిపల్…

Read Full News

దసరా పండుగ రోజునే ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆడపడుచుల ఆవేదన

తమ స్థలానికి రక్షణ కల్పించాలని వేడుకోలు.. న్యాయం జరగకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక రుద్రూరు, అక్టోబర్ 21 (E6tv న్యూస్). దసరా పండుగ పూట కూడా తమకు వేధింపులు తప్పడం లేదని, తమ స్థిరాస్తి విషయంలో న్యాయం చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట అక్బర్ నగర్ గ్రామానికి చెందిన మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ప్రాణహాని ఉందని, జీవించడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు….

Read Full News

46 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ అభినందనీయం

బోధన్, అక్టోబర్ 19: (E6tv NEWS: ప్రతినిధి). దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 46 మందికి ట్రై సైకిళ్లు అందజేయడం గర్వకారణమని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. శాల గంగాధర్ అన్నారు.లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3200, లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ చారిటబుల్ ట్రస్ట్, పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 46 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేయడం పట్ల ఆయన…

Read Full News

లింగంపేట్ మండలంలో లబ్ధిదారునికి CMRF చెక్కు పంపిణీ

పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట – సాయిరాం యాదవ్ ఎల్లారెడ్డి, అక్టోబర్ 17 (E6tv న్యూస్). కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలంలో బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును పంపిణీ చేశారు. లింగంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిరాం యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కలిసి లబ్ధిదారునికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సాయిరాం యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి…

Read Full News

నందిగామలో గౌడ హాస్టల్ భవనం ప్రారంభం

ప్రారంభోత్సవంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ పటాన్‌చెరు, అక్టోబర్ 17 (E6tv న్యూస్). సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలో గౌడ హాస్టల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర టాడీ టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌడ హాస్టల్…

Read Full News

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

దసరా నేపథ్యంలో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ కోరుట్ల, అక్టోబర్ 17 (E6tv న్యూస్). దసరా పండుగ నేపథ్యంలో పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కొమ్ము తిరుపతి మాట్లాడుతూ.. పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకునేలా చూడటం పోలీసుల ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు….

Read Full News