Nalgonda
ఆస్తి వివాదం.. తండ్రిని కర్రతో కొట్టి చంపిన కొడుకు
పెట్రోల్ బంకు విషయంలో తలెత్తిన గొడవే హత్యకు కారణమా? ధర్మపురి, అక్టోబర్ 31 (E6tv న్యూస్):l. ఆస్తి వివాదాలు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. కన్నతండ్రినే కుమారుడు కర్రతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. ధర్మపురి మండలం నెరెళ్ల గ్రామానికి చెందిన మేడిపల్లి వెంకటేశ్ (55)ను ఆయన కుమారుడు మేడిపల్లి లక్ష్మణ్ (36) శనివారం కర్రతో తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో వెంకటేశ్ అక్కడికక్కడే మృతి…
కోరుట్ల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీతారాణి సస్పెండ్
కోరుట్ల, అక్టోబర్ 31 (E6tv న్యూస్). విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పరిపాలనా లోపాల కారణంగా జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి. సునీతారాణి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 31న జిల్లా కలెక్టర్ కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో సూపరింటెండెంట్ డాక్టర్ సునీతారాణి సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. ఆసుపత్రి పరిపాలన,…
ఎల్‌నినో ఎఫెక్ట్.. తాగునీటి కోసం రూ.120 కోట్లు!
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాల కోసం రూ.120 కోట్లతో పాటు, ఇతర జిల్లాల తక్షణ అవసరాలకు ఒక్కో దానికి రూ. కోటి చొప్పున నిధులు మంజూరు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మంత్రి.. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అద్దె బోరుబావులు, ట్యాంకర్ల…
జాతీయ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్
ఘన నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇందూరు, అక్టోబర్ 31: (E6tv NEWS: శివ ఠాకూర్). దేశ సమగ్రత, జాతీయ ఐక్యత కోసం విశేష కృషి చేసిన మహానుభావుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శనివారం నగరంలోని వర్ని చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి…
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ.. ఫోన్ ఫ్లాష్లైట్లతో ఫ్లాష్ వాక్ నిజామాబాద్, అక్టోబర్ 30 (E6tv న్యూస్: శివ ఠాకూర్). సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ జిల్లా అదనపు పోలీస్ కమిషనర్ శుభం ప్రకాశ్ సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఫోన్ ఫ్లాష్లైట్లతో ప్రత్యేక ఫ్లాష్ వాక్, అవగాహన ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య,…
నేతాజీ నగర్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు పరిష్కారం
జలమండలి అధికారుల దృష్టికి సమస్య.. చొరవ చూపిన కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ గచ్చిబౌలి, అక్టోబర్ 30:(E6tv NEWS). శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించింది. డ్రైనేజీ నుంచి మురుగునీరు ఇళ్లలోకి చేరుతుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ వెంటనే జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సూపర్వైజర్ సురేష్‌కు సమాచారం అందించడంతో…
రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని భూముల రీ సర్వే పూర్తి చేయాలి
పారదర్శకంగా భూముల హద్దుల గుర్తింపు.. రైతుల సమక్షంలోనే సర్వే చేపట్టాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా నిర్మల్ జిల్లా, అక్టోబర్ 30 (E6 TV న్యూస్). భూముల రీ సర్వే ప్రక్రియను రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం నర్సాపూర్ (జి) మండలం చాక్పల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా…
సాగర సంఘం భవన నిర్మాణానికి ఎంపీకి వినతి
ఎంపీ ల్యాడ్స్ నిధులతో సహాయం అందించాలని విజ్ఞప్తి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చిన రవికుమార్ యాదవ్ శేరిలింగంపల్లి, అక్టోబర్ 29 (E6 TV NEWS). శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్లో సాగర (ఉప్పర) సంఘం భవన నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ సంఘం ప్రతినిధులు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవికుమార్ యాదవ్‌లను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. బీజేపీ రాష్ట్ర ఓబీసీ…
మాధవ్‌నగర్ ఆర్ఓబీకి రూ. 8.68 కోట్ల అదనపు నిధులు మంజూరు చేయాలని వినతి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి.. పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు అక్టోబర్ 29:(E6tv న్యూస్-శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంలోని మాధవ్‌నగర్ రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు రూ. 8.68 కోట్ల అదనపు నిధులు మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతి అందజేశారు. మాధవ్‌నగర్ ఆర్ఓబీ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో రాకపోకలు మరింత సులభతరం…
భైంసా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చట్టపరమైన అవగాహన కార్యక్రమం
‘సురక్షిత బచ్పన్ అభియాన్’ ఆధ్వర్యంలో విద్యార్థులకు బాలల హక్కులు, రక్షణపై అవగాహన భైంసా, అక్టోబర్ 29 (E6 టీవీ న్యూస్) నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ‘సురక్షిత బచ్పన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా చట్టపరమైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, బాలలపై జరిగే లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించే చట్టాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం….
