Nalgonda
పదో తరగతి పరీక్ష ఫీజుల పేరుతో ప్రైవేట్ పాఠశాలల దోపిడీ!
అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి – TGVP బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాలే నాగేష్ బోధన్, నవంబర్ 13:(E6tv NEWS). పదో తరగతి పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ ప్రైవేట్ పాఠశాలలు దోపిడీకి పాల్పడుతున్నాయని, అటువంటి పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాలే నాగేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన…
రహదారిపై మరో నిండు ప్రాణం బలి!
జిల్లాపల్లి ఆబాది వద్ద కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు సలీం మృతి పోతంగల్, నవంబర్ 13: (E6tv న్యూస్). నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పోతంగల్ మండలం జిల్లాపల్లి ఆబాది సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సలీం అనే వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సలీంను కారు బలంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. జిల్లాపల్లి ఆబాదికి చెందిన సలీం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా…
స్కూల్ వ్యాన్ ఢీకొని వ్యక్తికి గాయాలు
రుద్రూర్ – కోటగిరి, నవంబర్ 13 (E6tv న్యూస్). నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం కొండాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోటగిరి మండల కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల స్కూల్ వ్యాన్ ఢీకొనడంతో సాయిలు అనే వ్యక్తి గాయపడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్‌ను వివరణ కోరగా, కోటగిరికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల వ్యాన్ ఢీకొనడంతో సాయిలుకు గాయాలయ్యాయని తెలిపారు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి,…
ఆదివాసీల ఆరాధ్య దైవం.. భగవాన్ బిర్సా ముండా!
భారతీయ విద్యాభవన్ స్కూల్లో జన్‌జాతీయ గౌరవ్ పఖ్వాడా కార్యక్రమం బిర్సా ముండా వీరోచిత పోరాటం, స్వాతంత్ర్య ఉద్యమ సేవలపై విద్యార్థులకు అవగాహన పటాన్చెరు, నవంబర్ 12 (E6 TV న్యూస్). ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు, బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వీరుడు భగవాన్ బిర్సా ముండా అని వక్తలు పేర్కొన్నారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలం బీహెచ్ఈఎల్లో ఉన్న భారతీయ విద్యాభవన్ స్కూల్లో జన్‌జాతీయ గౌరవ్ పఖ్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా…
మానవత్వమే మహోన్నతం..!
కులం అడగని సహాయం.. మతం చూడని మానవత్వం..! ఆపదలో అండగా నిలుస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్న జుబేర్ భాయ్.. కోటగిరి, నవంబర్ 12: (E6tv NEWS). మనిషి గొప్పతనం అతని ఆస్తిపాస్తుల్లో కాదు.. ఆపదలో ఉన్న మరో మనిషికి అందించే ఆపన్నహస్తంలో ఉంటుంది.కులం చూడకుండా.. మతం అడగకుండా.. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ భరోసా కల్పించడం నిజమైన మానవత్వానికి నిదర్శనం.అలాంటి సేవాభావంతో కోటగిరి మండల ప్రజల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందుతున్న వ్యక్తి జుబేర్ భాయ్….
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రవాణా శాఖ అధికారులతో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సమీక్ష
పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి – ఆదాయ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి నిజామాబాద్, నవంబర్ 12:(E6tv NEWS). జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (ఐటీ, విజిలెన్స్ అండ్ రోడ్ సేఫ్టీ) ఎం. చంద్రశేఖర్ గౌడ్ నిజామాబాద్‌లో పర్యటించి, నిజామాబాద్ ఉప రవాణా కమిషనర్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల రవాణా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి శాఖాపరమైన పనితీరుపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన…
కోరుట్ల మహామేరు సంఘం స్థలంలో అక్రమ నిర్మాణం!
నిర్మాణం ఆపినట్లు కలెక్టర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారా? మున్సిపల్ అధికారుల తీరుపై సంఘ సభ్యుల ఆగ్రహం కోరుట్ల, నవంబర్ 11 (E6tvన్యూస్). జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సుభాష్ రోడ్డులో ఉన్న మహామేరు సంఘం స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ సంఘ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘానికి చెందిన రిజిస్ట్రేషన్ నంబర్ 3760/95, ఇంటి నంబర్ 5-1-12 పరిధిలోని స్థలంలో సంఘ సభ్యులకు తెలియకుండా సుమారు 50 గజాల స్థలాన్ని విక్రయించారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై…
బుగ్గారం రైతుల ధాన్యం కొనుగోలు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి!
బీటు కోసం 40 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలి శాశ్వత ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి పక్కా రోడ్డు, మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఎన్. ప్రసూనాంబకు వినతిపత్రం అందజేసిన చుక్క గంగారెడ్డి జగిత్యాల, నవంబర్ 09 (E6tv న్యూస్). బుగ్గారం గ్రామ రైతులు ప్రతి ఏటా ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సామాజిక హక్కుల కార్యకర్త, గ్రామ అభివృద్ధి కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ జన…
భక్తి పారవశ్యంలో ముంచెత్తేలా ‘హరిహర సుతుడా శరణం అయ్యప్ప’ గీతం
పటాన్చెరులో ఘనంగా అయ్యప్ప భక్తిగీతం ఆడియో విడుదల గురుస్వామి నర్రా బిక్షపతి, రమ సంజీవరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ అయ్యప్ప భక్తుల మనసులను హత్తుకునేలా ఆర్ఆర్ టీం భక్తిగీతం భక్తి పాటలతో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించాలి: గురుస్వామి నర్రా బిక్షపతి పటాన్చెరు, నవంబర్ 9 (E6tv న్యూస్). అయ్యప్ప స్వామి భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తేలా రూపొందించిన ‘హరిహర సుతుడా శరణం అయ్యప్ప’ భక్తిగీతం ఆడియో విడుదల కార్యక్రమం పటాన్చెరులో ఘనంగా జరిగింది. పట్టణంలోని శాంతినగర్ అయ్యప్ప…
కామారెడ్డి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దినేష్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
వడ్డేపల్లి దినేష్ రెడ్డికి జిల్లా హ్యాండ్‌బాల్ పగ్గాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ ఎల్లారెడ్డి, నవంబర్ 07 (E6tv న్యూస్). కామారెడ్డి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా వడ్డేపల్లి దినేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం సదాశివనగర్ మండలం భూంపల్లిలోని జీపీ గార్డెన్స్‌లో నిర్వహించిన జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…
